News June 29, 2024
CTR: మామిడి రైతులకు సూచనలు

ఇంకా మామిడి కాయలు కోయకుండా ఉన్న రైతులు అప్రమత్తంగా ఉండాలని బంగారుపాలెం ఉద్యాన శాఖ అధికారిణి సాగరిక సూచించారు. పండు ఈగతో నష్టం జరగకుండా బుట్టలను ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎకరాకు 6 నుంచి 8 పండు ఈగ బుట్టలను పెట్టుకోవాలని సూచించారు. బుట్టలోని చెక్క ముక్క పైన ఏదైనా పురుగుమందు 4 నుంచి 5 చుక్కలు వేసుకోవాలని కోరారు.
Similar News
News September 16, 2025
చిత్తూరు: 19న మెగా జాబ్ మేళా

చిత్తూరు జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 19వ తేదీన మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి పద్మజ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం మూడు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ, ఎంబీఏ, ఎంకాం, పీజీ, డీ, బీ ఫార్మసీ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News September 15, 2025
రొంపిచర్లలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

బైకులు ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన రొంపిచర్ల మండలంలో జరిగింది. అన్నమయ్య జిల్లా పీలేరుకు చెందిన విజయ్ కుమార్ అతని భార్య రాజేశ్వరితో కలిసి బైక్‌పై తిరుపతికి వెళుతుండగా రొంపిచర్లకు చెందిన మహమ్మద్ గౌస్ పీర్ బైక్‌పై వస్తూ ఆదర్శ పాఠశాల సమీపంలో ఢీకొన్నారు. ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. మహమ్మద్ గౌస్ పీర్‌ను మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
News September 15, 2025
కాణిపాకంలో రేపు లడ్డూ వేలంపాట

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి మహాప్రసాదం లడ్డూకు బహిరంగంగా వేలం నిర్వహిస్తున్నట్లు ఈవో పెంచల కిశోర్ తెలిపారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం తెప్పోత్సవాలను నిర్వహించనున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు రేపు 21వ రోజు కావడంతో 21 కేజీల లడ్డూను తెప్పోత్సవం ముగిసిన తర్వాత కోనేరు ఎదుట వేలం వేయనున్నారు.