News February 7, 2026

CTR: మార్చి నుంచి HANUMAN ప్రాజెక్ట్ ప్రారంభం..!

image

ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న మానవ–వన్యప్రాణుల ఘర్షణలను తగ్గించేందుకు GOVT మార్చి నుంచి హనుమాన్ ప్రాజెక్ట్‌ అమలుకు సన్నాహాలు చేస్తోంది. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు, మొబైల్ వైల్డ్‌లైఫ్ అంబులెన్స్‌లు, ప్రాంతీయ వన్యప్రాణి రక్షణ-చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఆధునిక సాంకేతికతతో వన్యప్రాణుల కదలికలపై నిఘా, తక్షణ సహాయం, వేగవంతమైన నష్టపరిహారం, ప్రజల ప్రాణాలు కాపడటమే లక్ష్యంతో ఈ పథకం రూపొందించారు.

Similar News

News February 11, 2026

దళిత యువతి వంట చేస్తోందని..

image

తరాలు మారుతున్నా కుల వివక్ష ఆగడం లేదు. ఒడిశాలోని కేంద్రపడాలో దళిత యువతి వంట చేస్తోందని అంగన్వాడీకి పిల్లలను పంపడం లేదు. శర్మిష్ఠ సేథి(23) ఇటీవల ఘడియామల్‌లోని అంగన్వాడీలో హెల్పర్-కుక్‌గా నియమితులయ్యారు. ఆమె వంట చేస్తోందని అంగన్వాడీకి ఎవరి పిల్లల్నీ పంపొద్దని విలేజ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో 3 నెలలుగా ఈ సెంటర్ మూతబడింది. విషయం బయటికి రావడంతో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రకటించారు.

News February 11, 2026

వంటింటి చిట్కాలు మీ కోసం

image

* కిస్‌మిస్‌లు నిల్వ చేసే ముందు రెండు స్పూన్ల బియ్యప్పిండిని వాటికి పట్టిస్తే ఎన్ని రోజులైనా అతుక్కోకుండా ఉంటాయి.
* నూనె డబ్బాలు ఎంత తోమినా జిడ్డుగానే ఉంటాయి. అప్పుడు కాస్త క్రిస్టల్ సాల్ట్, డిష్ వాష్ లిక్విడ్ వేసిన నీటిలో డబ్బాను కాసేపు నానబెట్టి స్క్రబ్బర్‌తో రుద్దితే జిడ్డంతాపోయి తళతళా మెరుస్తాయి.
* చేపలు శుభ్రం చేసిన తర్వాత శెనగపిండి పట్టించి ఐదు నిమిషాల తర్వాత కడిగితే నీచు వాసన పోతుంది.

News February 11, 2026

ఖానాపూర్‌లో అత్యధికం.. నిర్మల్‌లో అత్యల్పం

image

ఉదయం 11 గంటల వరకు నిర్మల్ జిల్లాలో సగటున 18.29 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఖానాపూర్ మున్సిపాలిటీలో అత్యధికంగా 23.65 శాతం ఓటింగ్ జరగగా, భైంసాలో 21.34 శాతం నమోదైంది. జిల్లా కేంద్రమైన నిర్మల్‌లో మాత్రం ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో 15.73 శాతంతో అత్యల్ప పోలింగ్ నమోదైంది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 30,540 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.