News August 20, 2025
CTR: వినాయక విగ్రహాలకు పర్మిషన్ ఇలా పొందండి

చిత్తూరు జిల్లాలో వినాయక విగ్రహాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ కచ్చితంగా పోలీసుల పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అది ఎలానో ఇప్పుడు చూద్దాం.
➤<
➤ఫోన్ నంబర్ టైప్ చేసి ఓటీపి ఎంటర్ చేయండి
➤ తర్వాత అక్కడ అడిగే అన్ని వివరాలు నమోదు చేసి సబ్‌మిట్ చేయండి.
NOTE: అప్లికేషన్‌లో విగ్రహం సైజ్ ఎంతో చెప్పాల్సి ఉంటుంది. ముందుగానే విగ్రహాన్ని బుక్ చేసుకోండి.
Similar News
News August 20, 2025
CTR: వేంకన్న పాదం పెట్టిన స్థలం గురించి తెలుసా?

చిత్తూరు జిల్లా రొంపిచర్ల-ఎం.బెస్తపల్లి మార్గంలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. భక్తులు చిన్నగుడి కట్టి పూజలు చేస్తున్నారు. పెరటాసి నెల శనివారాల్లో ఇక్కడ పూజలు ఘనంగా జరుగుతాయి. తిరుమల వెళ్తూ శ్రీవారు ఇక్కడ ఎడమ పాదం మోపినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రదేశాన్ని వేంకటేశుని పాదం అని పిలుస్తున్నారు. ఇక్కడి ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. TTD స్పందించి అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
News August 20, 2025
చిత్తూరు: అధ్వానంగా రోడ్లు

చిత్తూరు జిల్లాలో ఇటీవల వరుసగా వర్షాలు పడుతున్నాయి. చాలా ప్రధాన మార్గాలతో పాటు గ్రామీణ రోడ్లు అధ్వానంగా మారాయి. రోడ్లపై ఉన్న గుంతల్లో వర్షపు నీరు చేరింది. కొన్ని చోట్ల రోడ్లు బురదమయంగా మారడంతో రాకపోకలకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. పై ఫొటో పుంగనూరు-శంకర్రాయలపేట రోడ్డు దుస్థితిని తెలియజేస్తోంది. అధికారులు తాత్కాలిక చర్యలైనా చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. మీ ఏరియా రోడ్లూ ఇలానే ఉన్నాయా?
News August 20, 2025
చిత్తూరు నగరంలో ‘సే టు నో డ్రగ్స్’

చిత్తూరు నగరంలోని 32, 34, 40, 41 వార్డ్ పరిధిలో మంగళవారం మత్తు పదార్థాల నిషేధంపై ‘సే టు నో డ్రగ్స్’ కార్యక్రమాన్ని WMSKలు నిర్వహించినట్లు టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య తెలిపారు. వార్డ్ ప్రజలకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్ధాలను వివరించామన్నారు. యువత మత్తుకు బానిస కావద్దని సూచించారన్నారు. డ్రగ్స్ విక్రయించిన, సేవించిన చట్టరీత్యా నేరమన్నారు. డ్రగ్స్ సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలన్నారు.