News April 24, 2024
CTR: సమోసాలు అమ్మే వ్యక్తి నామినేషన్

చిత్తూరు జిల్లా పలమనేరు స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా K.బాషా నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో ఆయన సమోసాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఎమ్మెల్యే కావాలన్నది తన చిరకాల కోరికని చెప్పారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి మనోజ్ కుమార్ రెడ్డికి నామినేషన్ పత్రాలను అందజేశారు. నిన్న మదనపల్లెలో బజ్జీలు విక్రయించే మహిళ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.
Similar News
News December 18, 2025
చిత్తూరు: ఉగాదికి గృహప్రవేశాలు..!

చిత్తూరు జిల్లాలో వచ్చే ఉగాది నాటికి పక్కా గృహాల నిర్మాణాలను పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని CM చంద్రబాబు పేర్కొన్నారు. కలెక్టర్ల సమావేశంలో జిల్లా హౌసింగ్‌పై CM సమీక్షించారు. జిల్లాలో PMAY కింద గతంలో 73,098 గృహాలు మంజూరు కాగా 58,966 పూర్తయ్యాయి. మరో 11,048 పక్కా గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి. పాతవి 9,912 కొత్తగా మంజూరైన 2,105 గృహాలను కలిపి 12,048 గృహాలను ఉగాది నాటికి సిద్ధం చేయాలన్నారు.
News December 18, 2025
చిత్తూరు జిల్లాలో పారిశ్రామిక పార్కులు

చిత్తూరు జిల్లాలోని 7నియోజకవర్గాల్లో 3 విడతల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయనున్నారు. మొదటి విడతలో కుప్పం 34.57 ఎకరాలు(పొగురుపల్లి), పలమనేరు 4 ఎకరాలు(నంగమంగళం), రెండో విడతలో చిత్తూరులో 67.91 ఎకరాలు (వెంకటాపురం), నగరి 50 ఎకరాలు (మాంగాడు), పుంగనూరులో 21.08 ఎకరాల్లో పార్కులు నిర్మిస్తారు. మూడో విడతలో పూతలపట్టులో 87.75 ఎకరాలు, జీడీనెల్లూరులో 81.87 ఎకరాల్లో MSME పార్కులు ఏర్పాటు కానున్నాయి.
News December 18, 2025
డ్వాక్రా రుణాల్లో వెనుకబడ్డ చిత్తూరు

డ్వాక్రా రుణాల పంపిణీలో చిత్తూరు జిల్లా వెనుకబడింది. జిల్లాలో డ్వాక్రా సంఘాల లక్ష్యం మేరకు రుణాలు పంపిణీ చేయడంలో అధికారులు నిర్దేశిత లక్ష్యాలను చేరుకోలేకపోయారు. MCP-1(ఉత్పాదక రుణాలు), MCP-2 (విని యోగ రుణాలు) కింద 63% రుణాలను మాత్రమే పంపిణీ చేశారు. జిల్లాకు రూ.2427.51 కోట్ల లక్ష్యం ఉండగా, రూ.1527.24 కోట్ల రుణాలు మాత్రమే బ్యాంకు లింకేజీ ద్వారా పంపిణీ చేశారు.


