News December 6, 2024
CTR : 10వ తేదీన జాబ్ మేళా

APSSDC ఆధ్వర్యంలో 10వ తేదీన చిత్తూరు పట్టణంలోని జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయం నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చిత్తూరు జిల్లా నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారి గుణశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. 4 కంపెనీల ప్రతినిధుల హాజరవుతారని తెలియజేశారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. స్థానిక, పరిసర ప్రాంత నిరుద్యోగ అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News October 16, 2025
చిత్తూరు జిల్లాలో సోషల్ ఆడిట్ పూర్తి

చిత్తూరు జిల్లాలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన సామాజిక తనిఖీ ప్రజావేదిక సోషల్ ఆడిట్ పూర్తయింది. 58 పాఠశాలలు తనిఖీ చేసి ఆడిట్ రిపోర్ట్ అందజేశారు. కన్నన్ కళాశాలలో జరిగిన హెచ్ఎంల సమావేశంలో ఆడిట్ రిపోర్ట్ అందజేశారు. ఆడిట్ రిపోర్టును 11 మంది రిసోర్స్ పర్సన్స్ పరిశీలించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం, పాఠశాల రికార్డులు తనిఖీ చేశారు. సమగ్ర శిక్ష ఏవో నాగరాజు సిబ్బంది పాల్గొన్నారు.
News October 16, 2025
CTR: 23 నుంచి స్కూల్లో ఆధార్ క్యాంపులు

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశింది. ఈ మేరకు చిత్తూరు జిల్లాలో ఈనెల 23 నుంచి 30వ తేదీ వరకు గుర్తించిన స్కూల్లో ఆధార్ కార్డు శిబిరాలు నిర్వహిస్తామని డీఈవో వరలక్ష్మి ప్రకటించారు. విద్యార్థుల బయోమెట్రిక్ అప్డేట్ చేస్తామని చెప్పారు. మార్పులు, చేర్పులు సైతం చేసుకోవచ్చన్నారు.
News October 15, 2025
గూగుల్ రాకపై చిత్తూరు MP ఏమన్నారంటే..?

విశాఖలో గూగుల్ ఏర్పాటుతో డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఊతమస్తుందని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్ రావు అన్నారు. నూతన ఆవిష్కరణలో సీఎం చంద్రబాబు ముందుంటారని కొనియాడారు. వికసిత భారత్లో ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేస్తోందన్నారు. ఏపీ, గూగుల్ మధ్య ఒప్పందం చారిత్రాత్మకమని చెప్పారు. ఈ ఒప్పందంతో విశాఖపట్నం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిందన్నారు.