News November 21, 2024
CTR: 23వ తేదీన జాబ్ మేళా

చిత్తూరు జిల్లా ఇరువారంలో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC)లో 23వ తేదీ ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారి గుణశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. 4 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, ఏదైనా డిగ్రీ, బి.ఫార్మసీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. మొత్తం 225 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు చెప్పారు.
Similar News
News December 10, 2025
చిత్తూరు: కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకోవాలని వినతి

ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకోవాలని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్కు వైసీపీ ఎంపీలు బుధవారం వినతిపత్రం అందజేశారు. రాజంపేట, తిరుపతి ఎంపీలు మిథున్ రెడ్డి, గురుమూర్తి, రాజ్యసభ ఎంపీ సుబ్బారెడ్డి తదితరులు ఆమెకు వినతిపత్రం అందజేశారు. కాలేజీల ప్రైవేటీకరణతో పేదలకు తీరని అన్యాయం జరుగుతుందని చెప్పారు.
News December 10, 2025
పలమనేరు-కుప్పం హైవేపై లారీ-RTC బస్సు ఢీ

పలమనేరు-కుప్పం జాతీయ రహదారిలోని వీకోట(M) జీడీగుట్ట సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని RTC బస్సు ఢీకొనడంతో 16 మంది ప్రయాణికులు గాయపడ్డారు. విజయవాడ నుంచి కుప్పం వస్తున్న ఆర్టీసీ లగ్జరీ బస్సు జీడీగుట్ట వద్ద ఆగి ఉన్న లారీని వెనకవైపు నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో 16 మంది ప్రయాణికులు గాయపడగా క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కుప్పం PES, ఏరియా ఆసుపత్రికి తరలించారు.
News December 9, 2025
చిత్తూరు కలెక్టర్ హెచ్చరికలు ఇవే..!

చిత్తూరు జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా, ప్రోత్సహించినా వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సుమిత్ కుమార్ హెచ్చరించారు. ఆడపిల్లల నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో నిఘాతో పాటు అవగాహన సదస్సులు కూడా నిర్వహించాలని వైద్యాధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పీసీ & పీఎన్డీటీ చట్టం కింద జిల్లాస్థాయి బహుళ సభ్యుల అప్రూవింగ్ అథారిటీపై సమీక్షించారు.


