News November 21, 2024
CTR: 23వ తేదీన జాబ్ మేళా

చిత్తూరు జిల్లా ఇరువారంలో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC)లో 23వ తేదీ ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారి గుణశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. 4 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, ఏదైనా డిగ్రీ, బి.ఫార్మసీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. మొత్తం 225 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు చెప్పారు.
Similar News
News January 28, 2026
అందుబాటులోకి ఆయుష్మాన్ భారత్ కార్డులు

చిత్తూరు జిల్లాలో ఆయుష్మాన్ భారత్ కార్డులు అందుబాటులోకి వచ్చాయి. జిల్లాలో సుమారు 20 లక్షల మంది ఉన్నారు. వీరిలో 17 లక్షల మంది వివరాలను కార్డులో అధికారులు నమోదు చేయించారు. రోగి పూర్తి వివరాలు కార్డు స్కాన్ చేయడం ద్వారా వైద్యులకు తెలిసిపోతుంది. తద్వారా వైద్య సేవలు అందించడం సులభతరం కానుంది. స్థానిక ప్రభుత్వాసుపత్రుల్లోనే కాకుండా జిల్లా, ఏరియా, సిహెచ్సీలోనూ వీటి ద్వారా వైద్య సేవలు అందనున్నాయి.
News January 28, 2026
చిత్తూరుకు మరో 450 టన్నుల యూరియా

కడప జిల్లా నుంచి మరో 450 టన్నుల యూరియా చిత్తూరు జిల్లాకు బుధవారం రానుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళి తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 2,301 టన్నుల యూరియా నిల్వలున్నాయన్నారు. వీటిని 230 రైతు భరోసా కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా అందిస్తున్నామని వెల్లడించారు.
News January 28, 2026
రోడ్డు ఏర్పాటుకు రూ.18.30 కోట్లు మంజూరు

కుప్పం (M) మల్లానూరు నుంచి అడవి బూదుగూరు మీదుగా తమిళనాడు బోర్డర్ వరకు రోడ్డు ఏర్పాటుకు రూ.18.30 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మల్లనూరు నుంచి తమిళనాడు బోర్డర్ వరకు సింగల్ రోడ్డు ఉండడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు విస్తరణకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇస్తూ నిధులు మంజూరు చేసింది.


