News March 22, 2024
CTR: 4 చోట్లే పాత అభ్యర్థుల మధ్య పోటీ

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 10 చోట్ల 2019లో తలపడిన వారు ఇప్పుడు పోటీలో లేరు. నగరిలో గాలి భాను ప్రకాశ్, రోజా.. శ్రీకాళహస్తిలో మధుసూదన్ రెడ్డి, బొజ్జల సుధీర్, పీలేరులో చింతల రామచంద్రారెడ్డి, నల్లారి కిశోర్ రెడ్డి, పలమనేరులో వెంకటే గౌడ, అమర్నాథ్ రెడ్డి మాత్రమే మరోసారి పరస్పరం పోటీ పడనున్నారు. చంద్రగిరిలో పులివర్తి నాని పోటీలో ఉన్నా.. అక్కడి YCP అభ్యర్థి మారారు.
Similar News
News November 12, 2025
కాణిపాక ఆలయానికి రూ.1.06 కోట్ల ఆదాయం

కాణిపాకంలో ఆన్‌లైన్, సీల్డ్ టెండర్లు, బహిరంగ వేలాలు బుధవారం నిర్వహించారు. ఈక్రమంలో దేవస్థానానికి మొత్తం రూ.1,06,99,997 ఆదాయం లభించింది. షాపింగ్ కాంప్లెక్స్, హోటల్ లైసెన్స్ హక్కు రూ.54.63 లక్షలు, పాదరక్షల భద్రపరుచుకునే హక్కు రూ.24.56 లక్షలు, వినాయక సదన్ హోటల్ లైసెన్స్ హక్కు రూ.27.10 లక్షలు, కళ్యాణమండపం షాపు హక్కు రూ.70 వేలు పలికిందని ఈవో పెంచల కిషోర్ వెల్లడించారు.
News November 12, 2025
చిత్తూరు: టెన్త్ విద్యార్థులకు గమనిక

జిల్లాలోని అన్ని యాజమాన్య స్కూళ్లలో పదో తరగతి విద్యార్థులు అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈ నెల 25 వరకు అవకాశం కల్పించినట్లు డీఈవో వరలక్ష్మి తెలిపారు. రూ.50 అపరాధ రుసుంతో ఈ నెల 26 నుంచి డిసెంబర్ 3 వరకు, రూ.200 రుసుంతో డిసెంబర్ 4 నుంచి 10వ తేదీ వరకు, రూ.500తో డిసెంబర్ 11 నుంచి 15 వరకు అవకాశం ఉంటుందన్నారు.
News November 12, 2025
చిత్తూరులో ఏక్తా దివస్ ర్యాలీ

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని బుధవారం చిత్తూరులో రాష్ట్రీయ ఏక్తా దివస్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, కలెక్టర్ సుమిత్ కుమార్, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద రావు పాల్గొన్నారు. గాంధీ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్దార్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఎమ్మెస్సార్ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది.


