News March 18, 2024
CTR: ఉద్యోగాల పేరుతో రూ.10 కోట్లు స్వాహా

ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి పలువురిని మోసం చేసిన ఓ యువకుడి ఉదంతం ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరులో వెలుగు చూసింది. పట్టణంలోని బండ్లవంకకు చెందిన రెడ్డి సూర్యప్రసాద్ అలియాస్ భరత్ హైదరాబాద్, బెంగళూరులో నివాసం ఏర్పరచుకున్నాడు. నిరుద్యోగులకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని ముందుగా డిపాజిట్ రూపంలో రూ.10 కోట్లకు పైగా తీసుకున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ మోహన్ రెడ్డి కేసు నమోదు చేశారు.
Similar News
News January 24, 2026
TDPకి కంచుకోట నగరి: CM

నగరి TDPకి కంచుకోట అని CM చంద్రబాబు అన్నారు. ‘వచ్చే ఎన్నిక నాటికి నగరికి కృష్ణా జలాలు అందిస్తాం. కోసలను పారిశ్రామిక నగరంగా అభివృద్ధి చేస్తాం. యువతకు ఇక్కడే ఉపాధి కల్పిస్తాం. సమర్థవంతమైన MLAగా భాను పని చేస్తున్నాడు. పెన్షన్లు, తల్లికి వందనం సహా అన్ని పథకాలు అమలు చేశాం. నేరస్థులు రాజకీయాలు చేస్తే ఎలా ఉంటుందో చూశాం. ఐదేళ్లలో నంబర్ వన్‌గా రాష్ట్రాన్నిఅభివృద్ధి చేస్తాం’ అని నగరిలో CM అన్నారు.
News January 24, 2026
రూ.1,417 కోట్ల చెక్ అందజేసిన CM

మహిళల ఆర్థిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. నగరిలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో 12,932 మహిళా సంఘాలకు రూ.1,417 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాల మెగా చెక్‌ను సభ్యులకు శనివారం ఆయన అందజేశారు. కార్యక్రమంలో ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్, పలువురు అధికారులు పాల్గొన్నారు.
News January 24, 2026
రొంపిచర్ల: ప్రేమికుడిని పెళ్లి చేసుకున్న మిస్సింగ్ యువతి

రొంపిచర్ల R బెస్తపల్లిలో మూడో రోజుల క్రితం మిస్సయిన తేజశ్రీ(20) అనే యువతి తను ప్రేమించిన యువకుడు యోగేంద్ర రెడ్డి (24)ని పెళ్లి చేసుకుందని రొంపిచర్ల ఎస్సై మధుసూదన్ తెలిపారు. వీరు భాకరాపేట సమీపంలోని దేవరకొండ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఇద్దరు నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారని చెప్పారు. మేజర్లు కావడంతో ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు.


