News February 8, 2025

CUET PG.. దరఖాస్తులకు నేడే లాస్ట్

image

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్(CUET) PG ప్రవేశాలకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. <>https://exams.nta.ac.in/<<>> వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుల్లో సవరణకు ఈనెల 10-12 వరకు అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ప్రముఖ సెంట్రల్, ప్రైవేట్ వర్సిటీల్లో PG కోర్సుల్లో ప్రవేశాల కోసం CUET నిర్వహిస్తారు. 157 సబ్జెక్టుల్లో మార్చి 13 నుంచి 31 వరకు పరీక్షలు జరుగుతాయి.

Similar News

News December 7, 2025

మునగాకు కషాయంతో బోలెడు ప్రయోజనాలు!

image

మునగాకు కషాయంతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ‘ఫ్రెష్ ఆకులను ఒక గిన్నెలోకి తీసుకుని నీళ్లు పోసి మరిగించాలి. అవి మెత్తబడ్డాక వడకట్టి తాగాలి. మునగాకులను ఎండబెట్టి, పొడి చేసుకొని కూడా కషాయం చేసుకోవచ్చు. రోజూ పరగడుపున ఒక గ్లాసు ఈ నీటిని తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. షుగర్, BP, కొవ్వు, జీర్ణ సమస్యల్ని నియంత్రిస్తుంది. రక్తహీనత తగ్గుతుంది, ఎముకలు బలపడతాయి’ అని చెబుతున్నారు.

News December 7, 2025

వైజాగ్ పోర్టు రికార్డు.. 249 రోజుల్లో 60MMT

image

AP: విశాఖ పోర్టు సరుకు రవాణాలో రికార్డు సృష్టించింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్‌(2025-26)లో 249 రోజుల్లోనే 60M మెట్రిక్ టన్నుల సరుకును హ్యాండిల్ చేసింది. ఈ ఘనత సాధించడానికి గతేడాది 273రోజులు, 2023-24లో 275డేస్ పట్టింది. వాణిజ్యంలో జరుగుతున్న మార్పులు, మౌలిక వసతుల సవాళ్లను అధిగమించి, ప్రత్యామ్నాయ ట్రాన్స్‌పోర్ట్ మార్గాలపై దృష్టి సారించడంతోనే ఇది సాధ్యమైనట్లు పోర్టు ఛైర్మన్ అంగముత్తు పేర్కొన్నారు.

News December 7, 2025

మగవారి కంటే ఆడవారికే చలి ఎందుకు ఎక్కువంటే?

image

సాధారణంగా పురుషులతో పోలిస్తే ఆడవారిలో చలిని తట్టుకొనే శక్తి తక్కువ. మహిళల్లో పురుషులతో పోలిస్తే కండర ద్రవ్యరాశి తక్కువగా ఉంటుంది. దీనివల్ల మహిళల్లో వేడి తక్కువగా విడుదల అవుతుందంటున్నారు నిపుణులు. అలాగే ప్రోజెస్టెరాన్ హార్మోన్, థైరాయిడ్, మెటబాలిజం తక్కువగా ఉండటం, స్త్రీలలో కొవ్వు శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో వేడిని ఉత్పత్తి చేసే సామర్థ్యం ప్రభావితమవుతుందంటున్నారు.