News March 23, 2025
CUET UG దరఖాస్తు గడువు పెంపు

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ (CUET UG) దరఖాస్తు గడువును NTA పొడిగించింది. ఈనెల 24 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించింది. మార్చి 26 నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తులను సవరించుకోవచ్చు. మే 8 నుంచి జూన్ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి. సెంట్రల్, స్టేట్, ప్రైవేట్ వర్సిటీల్లో UG కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను CBT విధానంలో 13 భాషల్లో నిర్వహించనున్నారు.
Similar News
News March 24, 2025
ఈ ఏడాదిలో ఇదే చివరి వారం

అదేంటీ ఇది మార్చి నెలే కదా అనుకుంటున్నారా. మన తెలుగు సంవత్సరం అయిన ‘క్రోధినామ’ సంవత్సరం ఈనెల 29న పూర్తి కానుంది. అంటే ఈ ఏడాదిలో ఇదే చివరి వారం. వచ్చే ఆదివారం 30న ఉగాది సందర్భంగా తెలుగువారంతా ‘విశ్వావసు’ నామ సంవత్సరంలోకి అడుగుపెడతారు. పూర్తిగా ఇంగ్లిష్ క్యాలెండర్కు అలవాటుపడ్డ మనం తెలుగు సంవత్సరాలు, పంచాంగం, సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏమంటారు?
News March 24, 2025
అమెరికా టూరిజంపై ట్రంప్ ట్రేడ్ వార్ ఎఫెక్ట్

వివిధ దేశాలతో ట్రేడ్ వార్ వల్ల అమెరికా టూరిజంపై ప్రతికూల ప్రభావం పడనున్నట్లు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఓ నివేదికలో వెల్లడించింది. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కఠినమైన వలస విధానాలు, సుంకాలు పెంచుతూ వెళ్తున్నారు. దీంతో ఈ ఏడాది చివరికల్లా 5.1% మంది విదేశీ పర్యాటకులు తగ్గిపోయి, రూ.5.5లక్షల కోట్ల ఆదాయం తగ్గుతుందని అంచనా వేసింది. ఈ ఫిబ్రవరిలోనే కెనడా నుంచి టూరిస్టుల రాక 23% తగ్గిందని వివరించింది.
News March 24, 2025
ఇకపై వారి అకౌంట్లలోనే పింఛన్ జమ

AP: సామాజిక పింఛన్లు తీసుకుంటున్న దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం ఊరట కలిగించింది. వారు గురుకులాలు, వసతి గృహాల నుంచి వచ్చి పింఛన్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంపై దృష్టి సారించింది. ఇకపై వారి అకౌంట్లలోనే పెన్షన్ జమ చేయాలని నిర్ణయించింది. దీనివల్ల సుమారు 10వేల మంది దివ్యాంగ స్టూడెంట్స్కి ఉపశమనం కలగనుంది.