News March 31, 2024

CUET-UG దరఖాస్తు గడువు పెంపు

image

దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే CUET-UG-2024 <>దరఖాస్తు<<>> గడువును పొడిగిస్తున్నట్లు NTA ప్రకటించింది. ఇవాళ్టితో గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9.50 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తాజాగా ప్రకటించింది. తెలుగు సహా 13 భాషల్లో మే 15వ తేదీ నుంచి 31వ తేదీ మధ్య ఈ పరీక్షను ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు.

Similar News

News March 13, 2026

ఈ యాప్ గురించి మీకు తెలుసా?

image

మీ ఇంటి పరిసరాల్లో చెత్త పేరుకుపోయిందా? మూగజీవి చనిపోయి కుళ్లిన వాసనతో ఇబ్బంది పడుతున్నారా? వీటి గురించి కంప్లైంట్ చేసేందుకు ‘Swachhata’ అనే యాప్‌ ఉంది. వివిధ సమస్యలను ఫొటో తీసి యాప్‌లో అప్‌లోడ్ చేస్తే చాలు. నేరుగా మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు వెళ్తుంది. నిర్ణీత సమయంలోగా అధికారులు ఆ సమస్యను పరిష్కరించి, ఫొటోను అప్‌లోడ్ చేస్తారు. ఇది కేవలం పట్టణ ప్రాంతాల్లోనే అందుబాటులో ఉంది.

News March 13, 2026

సీఎం రేవంత్ ఎంత ఐటీ చెల్లించారంటే?

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొందే జీతంపై ఆదాయపు పన్ను చెల్లించారు. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సీఎం తరఫున ప్రభుత్వం రూ.1,04,054 పన్ను చెల్లించింది. ఏటా ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే సాధారణ పరిపాలన శాఖ (GAD) సీఎం, మంత్రుల ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేసి పన్నులు చెల్లిస్తుంది.

News March 13, 2026

షేమ్ ఆన్ యూ కావ్యా మారన్.. SMలో ట్రోలింగ్

image

హండ్రెడ్ లీగ్‌ సన్‌రైజర్స్‌లోకి PAK బౌలర్ <<19368622>>అబ్రార్‌ను<<>> తీసుకోవడంతో ఓనర్ కావ్యా మారన్‌పై SMలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె పాక్ ప్లేయర్‌ను కొనడం టెర్రరిజాన్ని ప్రోత్సహించడమేనని మండిపడుతున్నారు. ‘Shame on you kavya maran’ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఈ వివాదంపై BCCI వైస్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా స్పందించారు. IPL మినహా ఇతర లీగుల్లో ఎవరిని తీసుకోవాలనేది ఫ్రాంచైజీల ఇష్టమన్నారు.