News July 4, 2025
CUET(UG) ఫలితాలు విడుదల

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్(అండర్ గ్రాడ్యుయేషన్)-2025 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు ఇక్కడ <
Similar News
News July 4, 2025
డైరెక్ట్‌గా OTTలోకి వచ్చేసిన కీర్తి సురేశ్ మూవీ

కీర్తి సురేశ్, సుహాస్ జంటగా నటించిన సెటైరికల్ కామెడీ డ్రామా ‘ఉప్పు కప్పురంబు’ ఇవాళ డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రసారమవుతోంది. డైరెక్టర్ అని IV శశి తెరకెక్కించిన ఈ మూవీకి స్వీకర్ అగస్తి మ్యూజిక్ అందించారు. ఓ గ్రామంలో ఎదురైన అసాధారణ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొన్నారనేదే సినిమా కథ.
News July 4, 2025
భోగాపురం ఎయిర్‌పోర్ట్ తాజా ఫొటోలు

AP: ఉత్తరాంధ్ర అభివృద్ధికి వరమైన అల్లూరి సీతారామరాజు(భోగాపురం, VZM) ఎయిర్‌పోర్టు నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. టెర్మినల్ భవనం, రన్‌వే, ATC టవర్ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. నిత్యం 5,000 మంది కార్మికులు నిరంతరాయంగా పనిచేస్తున్న ఈ ప్రాజెక్టును జూన్ 2026 నాటికి అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అటు దేశంలో ఎక్కడా లేని విధంగా 3.8కి.మీ పొడవైన ఈ రన్‌వేపై తాజాగా ట్రయల్ రన్ నిర్వహించారు.
News July 4, 2025
ఒక్క బిడ్డకు జన్మనిస్తే రూ.1.30 లక్షలు!

జనాభా సంక్షోభాన్ని అధిగమించేందుకు చైనా ఓ పథకం ప్రవేశపెట్టనుంది. ఒక్కో బిడ్డను కంటే ఏడాదికి 3,600 యువాన్లు (రూ.43 వేలు) రివార్డు ఇచ్చేందుకు సిద్ధమైంది. మూడేళ్లపాటు ఈ నగదు ప్రోత్సాహాన్ని కొనసాగించనుంది. ఇప్పటికే చైనాలోని మంగోలియా ప్రాంతంలో రెండో బిడ్డను కంటే రూ.6లక్షలు, మూడో బిడ్డను కంటే రూ.12 లక్షలు ఇస్తున్నారు. పెళ్లిళ్ల సంఖ్య తగ్గిపోవడం, ఫలితంగా జననాల రేటు పడిపోతుండటంతో ఈ చర్యలు తీసుకుంటోంది.