News August 6, 2024
తెలంగాణ సాంస్కృతిక శిఖరం గద్దరన్న: CM రేవంత్

TG: ప్రజా గాయకుడు గద్దర్ వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ ఆయనకు నివాళులు అర్పించారు. ‘పాటకు పోరాటం నేర్పి.. తన గళంలో తూటాగా మార్చి అన్యాయంపై ఎక్కుపెట్టిన తెలంగాణ సాంస్కృతిక శిఖరం గద్దరన్నకు నివాళులు అర్పిస్తున్నా’ అని రేవంత్ ట్వీట్ చేశారు.
Similar News
News January 6, 2026
ఎక్కడ మేసినా పేడ మన పెరట్లోనే వెయ్యాలి

పశువులు పగలంతా బయట ఎక్కడ మేత మేసినా, సాయంత్రానికి తిరిగి తమ యజమాని ఇంటికే చేరుకుంటాయి. అవి వేసే పేడ యజమాని పెరట్లోనే పడుతుంది. అది ఎరువుగా ఉపయోగపడుతుంది. అలాగే ఒక వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ తిరిగినా, ఎంత పేరు ప్రఖ్యాతలు, డబ్బు సంపాదించినా ఆ లాభం చివరికి తన సొంత ఇంటికి, తన కుటుంబానికి లేదా తన ఊరికే ఉపయోగపడాలని ఈ సామెత చెబుతుంది.
News January 6, 2026
సంక్రాంతికి 5 వేలకు పైగా ప్రత్యేక బస్సులు!

TG: సంక్రాంతి పండుగ సందర్భంగా 5 వేలకు పైగా బస్సులు నడపాలని ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలోని జిల్లాలకు 2,500.. ఏపీకి 3 వేల వరకు బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 9వ తేదీ నుంచి రద్దీకి అనుగుణంగా ఈ ప్రత్యేక బస్సులను నడపనుంది. ఒకట్రెండు రోజుల్లో స్పెషల్ బస్సుల వివరాలు ప్రకటిస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. మరి మీరు పండుగకు ఊరెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారా?
News January 6, 2026
వాట్సాప్లో తిరుమల సమాచారం!

AP: తిరుమల వెళ్లే భక్తులు వాట్సాప్ ద్వారా పలు సేవలు పొందొచ్చు. 9552300009 నంబరుకు వాట్సాప్లో Hi అని మెసేజ్ పంపితే పలు రకాల సమాచారాన్ని టీటీడీ అందిస్తోంది. సర్వ దర్శన స్లాట్ల స్టేటస్, ఎన్ని కంపార్టుమెంట్లు నిండాయి?, అందుబాటులో ఉన్న శ్రీవాణి టికెట్లు, కాషన్ డిపాజిట్ రిఫండ్ ట్రాకింగ్ స్టేటస్ తదితర సేవలు అందుతాయని టీటీడీ పేర్కొంది.


