News October 8, 2025
కమిన్స్, హెడ్‌కు రూ.58 కోట్ల ఆఫర్!

ఆసీస్ క్రికెటర్లు కమిన్స్, హెడ్‌కు ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీ భారీ మొత్తం ఆఫర్ చేసినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. AUSను వీడి తమ ఫ్రాంచైజీ తరఫున గ్లోబల్ T20 టోర్నీల్లో ఆడితే ఏడాదికి రూ.58.2 కోట్ల చొప్పున ఇవ్వజూపినట్లు వెల్లడించాయి. దీనికి ప్లేయర్లు అంగీకరించలేదని తెలిపాయి. కాగా AUS జట్టు ఏడాదికి ఈ ప్లేయర్లకు చెరో రూ.8.74 కోట్లు చెల్లిస్తోంది. దీనికి దాదాపు 7 రెట్లు IPL ఫ్రాంచైజీ ఆఫర్ చేయడం గమనార్హం.
Similar News
News October 8, 2025
గంటల కొద్దీ ఒకే అంశం ప్రస్తావించొద్దు: హైకోర్టు

TG: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణలో HC కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఇదే చివరి విచారణ కాదు, అన్ని అంశాలు ప్రస్తావించొద్దు. గంటల కొద్దీ ఒకే అంశం ప్రస్తావించి సమయం వృథా చేయొద్దు’ అని పిటిషనర్లకు సూచించింది. ప్రభుత్వం తరఫున అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. ‘రిజర్వేషన్ల గరిష్ఠ పరిమితి 50% మించరాదని రాజ్యాంగంలో లేదు. ప్రజల అవసరాలను బట్టి వాటిని పెంచుకొనే అవకాశం ప్రభుత్వానికి ఉంది’ అని అన్నారు.
News October 8, 2025
ఆలిండియా రేడియో తొలి తెలుగు మహిళా న్యూస్‌రీడర్

ఆలిండియా రేడియో తొలి తెలుగు మహిళా న్యూస్‌రీడర్ జోలెపాళ్యం మంగమ్మ 1925 సెప్టెంబర్12న మదనపల్లెలో జన్మించారు. ఈమె MA,BEd, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. 1960లో AIRలో చేరి న్యూస్‌రీడర్‌గా, ఎడిటర్‌గా పనిచేశారు. కేంద్రసమాచారశాఖ, విదేశాంగశాఖల్లో కీలక పదవులు చేపట్టారు. ఈమెకు ENG, ఫ్రెంచ్, ఎస్పరాంటో, తమిళ, హిందీభాషల్లో ప్రావీణ్యం ఉంది.<<-se>>#firstwomen<<>>
News October 8, 2025
మరిన్ని కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి కసరత్తు

TG: కొత్తగా మరిన్ని ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులకు అనుమతి రాగా నిజామాబాద్, మహబూబ్ నగర్, పెద్దపల్లి ప్రాంతాల్లో విమానాశ్రయాల నిర్మాణానికి AAI, IAF అప్రూవల్ కోసం ప్రయత్నిస్తోంది. అటు గతంలో సాయిల్ టెస్టులో ఫెయిలైన కొత్తగూడెం దగ్గర అనువైన భూమి వెతికే పనిలో ఉన్నట్లు అధికార వర్గాలు వే2న్యూస్‌కు తెలిపాయి.