News February 8, 2025
బిడ్డకు జన్మనిచ్చిన కమిన్స్ భార్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738993133330_653-normal-WIFI.webp)
ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ భార్య బెకీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆమెకు ‘ఈదీ’ అని పేరు పెట్టినట్లు కమిన్స్ ఇన్‌స్టా ద్వారా తెలిపారు. కమిన్స్, బెకీ దంపతులకు ఇప్పటికే ఆల్బీ ఓ కూతురు ఉంది. మరోవైపు భార్య డెలివరీ నేపథ్యంలో శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు కమిన్స్ దూరమయ్యారు. అటు గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అతడు పాల్గొనడం లేదు.
Similar News
News February 8, 2025
ముగ్గురు పిల్లల్ని కనండి.. హిందువులకు VHP పిలుపు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738974638003_695-normal-WIFI.webp)
ప్రస్తుత జనన రేటు(1.9 శాతం) ప్రకారం హిందూ జనాభా తగ్గుతూనే ఉంటుందని VHP జనరల్ సెక్రటరీ సురేంద్ర జైన్ చెప్పారు. జనాభా అసమతుల్యతను అధిగమించేందుకు ప్రతి హిందూ జంట ఇద్దరు/ముగ్గురు పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రతిజ్ఞ చేయాలన్నారు. కుటుంబాలు విడిపోవడం పిల్లలు, యువతలో అభద్రతకు కారణమవుతోందని తెలిపారు. హిందూ సంప్రదాయాలు పాటించడమే ఈ సమస్యకు పరిష్కారమన్నారు.
News February 8, 2025
RESULTS: ఇప్పటివరకు ఎవరికి ఎన్ని సీట్లు?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739002384536_653-normal-WIFI.webp)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మేజిక్ ఫిగర్ దిశగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఆ పార్టీ 19 చోట్ల విజయం సాధించగా మరో 27 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. అధికారం చేపట్టాలంటే 36 సీట్లు అవసరం. కానీ ప్రస్తుత ఫలితాలు చూస్తుంటే కాషాయ పార్టీ అంతకుమించిన స్థానాల్లో గెలుపొందేలా కనిపిస్తోంది. మరోవైపు కేజ్రీవాల్, సిసోడియా ఓటములతో చతికిలపడ్డ ఆప్ 8 చోట్ల గెలుపొందింది. మరో 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
News February 8, 2025
AAPకి అధికారం ఎందుకు దూరమైందంటే?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738995600838_81-normal-WIFI.webp)
2015, 2020 ఎన్నికల్లో 70 స్థానాలకు 67, 62 స్థానాల్లో అద్భుత విజయం సాధించి అధికారంలోకి వచ్చిన AAPను ఈసారి పలు వివాదాలు చుట్టుముట్టాయి. హామీలు అమలు చేయకపోవడం, ఎయిర్ క్వాలిటీపై ప్రజల అసంతృప్తి, CM అధికార నివాసం శేష్ మహల్‌ను రూ.33.66 కోట్లతో అభివృద్ధి చేసుకోవడంపై ఆరోపణలు, AK అవినీతిపై BJP ప్రచారం, లిక్కర్ స్కాంలో AK, మంత్రులు, AAP నేతలు జైలుకెళ్లడంతో పాలన గాడితప్పి ఆ పార్టీని అధికారానికి దూరం చేశాయి.