News January 4, 2025
ఏపీలో షాక్ కొడుతున్న కరెంట్ బిల్లులు: YCP

APలో కరెంట్ బిల్లులు షాక్ కొడుతున్నాయంటూ వైసీపీ ట్వీట్ చేసింది. స్మార్ట్ మీటర్ల బిగింపు తర్వాత నెల రోజుల వ్యవధిలోనే వందల నుంచి వేలాది రూపాయలకు బిల్లులు పెరిగిపోయాయని ఆరోపించింది. నెల్లూరు జిల్లాలో ఓ చిరుద్యోగి ఇంటికి రూ.39,525 బిల్లు వచ్చిందని ఓ ఫొటోను పంచుకుంది. బిల్లుల బాదుడే.. బాదుడు రూపంలో పేదలకు న్యూఇయర్ కానుక ఇస్తున్నావా? అని సీఎం చంద్రబాబును ట్యాగ్ చేసింది.
Similar News
News December 13, 2025
(PMAY-G)-NTR స్కీమ్.. రేపటి వరకే ఛాన్స్

AP: PM ఆవాస్ యోజన గ్రామీణ (PMAY-G)-NTR పథకం దరఖాస్తు గడువు రేపటితో(డిసెంబర్ 14) ముగియనుంది. దరఖాస్తు చేసుకునేందుకు గ్రామ/వార్డు సచివాలయాల్లో సంప్రదించాలని అధికారులు సూచించారు. ఈ పథకం కింద సొంత ఇల్లు లేని పేద కుటుంబాలకు గృహ నిర్మాణం కోసం ₹2.50లక్షల వరకు ఆర్థిక సాయం అందుతుంది. సొంత స్థలం లేని వారికి 3 సెంట్ల స్థలం, ఆర్థికసాయం అందజేస్తారు.
News December 13, 2025
చంద్రబాబుపై ఫైబర్నెట్ కేసు కొట్టివేత

AP: సీఎం చంద్రబాబుకు భారీ ఊరట కలిగింది. గత ప్రభుత్వ హయాంలో నమోదైన ఫైబర్నెట్ కేసును ACB కోర్టు కొట్టేసింది. ఇతర నిందితులకూ క్లీన్చిట్ ఇచ్చింది. 2014-19 మధ్య ఫైబర్నెట్లో ₹114Cr స్కామ్ జరిగిందని కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా CID అధికారులు ఆ కేసు దర్యాప్తును ముగించినట్లు కోర్టుకు తెలిపారు. కేసు ఉపసంహరణకు అభ్యంతరం లేదని నాటి, నేటి ఫైబర్నెట్ MDలు చెప్పారు. దీంతో కోర్టు తీర్పు వెలువరించింది.
News December 13, 2025
బేబీ పౌడర్తో క్యాన్సర్.. J&Jకు రూ.360 కోట్ల షాక్!

బేబీ పౌడర్ కేసులో జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జాన్సన్ కంపెనీ పౌడర్ వాడటం వల్ల అండాశయ క్యాన్సర్ వచ్చిందని ఆరోపించిన ఇద్దరు మహిళలకు $40M(రూ.360 కోట్లు) చెల్లించాలంటూ కాలిఫోర్నియా జ్యూరీ ఆదేశించింది. నాలుగు దశాబ్దాలుగా పౌడర్ వాడటంతో క్యాన్సర్ వచ్చి కీమోథెరపీ చేయించుకోవాల్సి వచ్చిందని బాధితులు తెలిపారు. ప్రస్తుతం ఈ కంపెనీపై 67 వేలకుపైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి.


