News December 17, 2025

CUSB 84 పోస్టులకు నోటిఫికేషన్

image

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ బిహార్(CUSB) 84 టీచింగ్(62), నాన్ టీచింగ్(22) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు జనవరి 15వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, సంబంధిత విభాగంలో పీజీ, PhD, M.Ed, NET/SLET/SET, LLM, M.Tech, MBBS, M.LSc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://www.cusb.ac.in

Similar News

News April 15, 2026

యుద్ధం.. 4 పాయింట్లతో చైనా పీస్ ప్లాన్!

image

ఇరాన్, US మరోసారి చర్చలకు యత్నిస్తున్న నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ 4 పాయింట్లతో పీస్ ప్లాన్ సూచించారు. ‘పశ్చిమాసియా, గల్ఫ్‌లో సుస్థిర భద్రతా వ్యవస్థ ఏర్పాటుకు దేశాలు బంధాలు మెరుగుపరుచుకోవాలి. దేశాల జాతీయ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలి. ఐక్యరాజ్యసమితి కేంద్రంగా అంతర్జాతీయ వ్యవస్థను దృఢంగా నిలబెట్టాలి. అన్ని దేశాలు అభివృద్ధిని భద్రతతో అనుసంధానించాలి. ఇందుకు మేం సాయపడతాం’ అని పేర్కొన్నారు.

News April 15, 2026

GK: తొలి కంప్యూటర్ ప్రోగ్రామర్ ఎవరు?

image

☛ కంప్యూటర్ పితామహుడు-చార్లెస్ బాబేజ్
☛ ఆధునిక కంప్యూటర్ పితామహుడు-అలాన్ ట్యూరింగ్
☛ మొదటి కంప్యూటర్ ప్రోగ్రామర్-అడా లవ్‌లేస్ (ఫొటోలో)
☛ మొదటి ఎలక్ట్రానిక్ కంప్యూటర్-ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్ (ENIAC)
☛ కంప్యూటర్ మెదడు అని దేనిని పిలుస్తారు-CPU (సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్)
☛ 1024 MB: 1 GB (గిగాబైట్)
☛ 1024 GB: 1 TB (టెరాబైట్)

News April 15, 2026

నా శరీరంలో ఇప్పటికీ శకలాలు ఉన్నాయి: సంగక్కర

image

2009 పాక్ పర్యటనలో తమ బస్సుపై జరిగిన ఉగ్రదాడి గురించి శ్రీలంక మాజీ క్రికెటర్ సంగక్కర ఆశ్చర్యకర విషయాలు వెల్లడించారు. ‘మేం గ్రౌండ్‌కు బయల్దేరాం. బాంబు పేలి ఇంటికి తిరిగి వెళ్లిపోతే బాగుండని ఓ బౌలర్ అన్నాడు. నిమిషం కూడా గడవకముందే మాపై దాడి జరిగింది. నా శరీరంలో ఇప్పటికీ శకలాలు ఉన్నాయి’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో సంగక్కర, మెండిస్, సమరవీర, తరంగ, లక్మల్, తుషార గాయపడ్డారు.