News January 27, 2025
కస్టోడియల్ డెత్ కేసు: 8 మంది పోలీసులకు జీవిత ఖైదు

కస్టోడియల్ డెత్ కేసులో చండీగఢ్ CBI ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఐజీ సహా మరో ఏడుగురు తాజా, మాజీ పోలీసులకు జీవిత ఖైదు విధించింది. 2017లో సిమ్లాలో ఓ మైనర్ బాలికపై హత్యాచారం కేసులో నిందితుడు పోలీసుల కస్టడీలో మృతి చెందాడు. అయితే కస్టడీలో ఉన్న అతణ్ని మరో నిందితుడు హత్య చేసినట్టు పోలీసులు చిత్రీకరించారు. విచారణ అనంతరం కోర్టు వారిని దోషులుగా తేల్చింది.
Similar News
News December 3, 2025
అన్నమయ్య జిల్లాలో తాత్కాలిక అకాడమిక్ చాత్రోపాధ్యాయ నియామకాలు

అన్నమయ్య జిల్లా 17 మండలాల్లో 48 పాఠశాలల్లో D.Ed./ B.Ed. పూర్తి చేసిన అభ్యర్థులను 2025-26 విద్యా సంవత్సరానికి 5 నెలల వ్యవధికి తాత్కాలిక అకాడమిక్ చాత్రోపాధ్యాయగా నియమించేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అర్హతగల అభ్యర్థులు తమ దరఖాస్తులను 5వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు మండల విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలని DEO సుబ్రహ్మణ్యం తెలిపారు.
News December 3, 2025
సమంత-రాజ్.. కొత్త ఫొటోలు చూశారా?

హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు వివాహ బంధంలోకి అడుగుపెట్టడం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. సమంత మెహిందీ వేడుకకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఆమె నవ్వుతూ చేతులు చూపిస్తుండగా, రాజ్ ఫొటోలు తీశారు. సమంత క్లోజ్ ఫ్రెండ్ ఒకరు వీటిని SMలో పోస్ట్ చేశారు. ‘సమంత.. ఈ పెళ్లితో నీలో కొత్త రకమైన సంతోషాన్ని చూస్తున్నా. మీరిద్దరూ ఇలాగే కలకాలం కలిసుండాలి’ అని పేర్కొన్నారు.
News December 3, 2025
DCM అంటే దిష్టి చుక్క మంత్రి.. పవన్‌పై YCP సెటైర్లు

AP: కోనసీమ దిష్టి వివాదం నేపథ్యంలో Dy.CM పవన్ కళ్యాణ్‌పై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. పొద్దున లేస్తే హైదరాబాద్‌లోనే ఉండే ఆయన తెలంగాణ ప్రజలను కించపరిచేలా మాట్లాడటం సరికాదని హితవు పలుకుతున్నారు. అప్పుడప్పుడు ఏపీకి వచ్చే ఆయన ఇటీవల కోనసీమలో వెకేషన్ కోసం పర్యటించారని సెటైర్లు వేస్తున్నారు. డిప్యూటీ సీఎం(DCM) అంటే దిష్టి చుక్క మంత్రి అంటూ ఎద్దేవా చేస్తున్నారు.


