News November 22, 2024
భయంతో బంగారం కొంటున్న కస్టమర్లు!

దేశవ్యాప్తంగా బంగారం షాపుల్లో రద్దీ పెరిగింది. ట్రంప్ రాకతో గోల్డ్ రేట్ 6% మేర తగ్గింది. ఇంకా తగ్గుతుందేమో అని కస్టమర్లు వేచిచూసే ధోరణి కనబరిచారు. తాజాగా ఉక్రెయిన్, రష్యా పరస్పరం మిసైళ్లతో దాడులు చేసుకోవడంతో NOV 19న రూ.73,739గా ఉన్న తులం బంగారం ధర ఇప్పుడు రూ.76,559కి చేరుకుంది. వెడ్డింగ్ సీజన్ కావడం, రేటు మరింత పెరగొచ్చేమోనన్న భయంతో కస్టమర్లు నగలు కొంటున్నారని జువెలరీ సంఘం సభ్యులు చెప్తున్నారు.
Similar News
News October 16, 2025
క్యాబినెట్ సమావేశానికి కొండా సురేఖ గైర్హాజరు

TG: రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి మంత్రి కొండా సురేఖ గైర్హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితం డిప్యూటీ సీఎం భట్టితో భేటీ అయిన సురేఖ.. సచివాలయానికి రాకుండా బయటకు వెళ్లిపోయారు. మిగతా మంత్రులందరూ హాజరయ్యారు. ఇటీవల నెలకొన్న <<18020734>>వివాదాలతో<<>> ఆమె మంత్రివర్గ సమావేశానికి దూరంగా ఉన్నట్లు సమాచారం.
News October 16, 2025
గుజరాత్ మంత్రులంతా రాజీనామా

గుజరాత్లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. స్థానిక ఎన్నికల దృష్ట్యా క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ కోసం ముఖ్యమంత్రి తప్ప మిగతా 16 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. కాసేపట్లో సీఎం భూపేంద్ర పటేల్ గవర్నర్‌ను కలవనున్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు కొత్త క్యాబినెట్ కొలువుదీరనుంది. నూతన మంత్రివర్గంలో 10 మంది కొత్తవారికి అవకాశం దక్కనున్నట్లు సమాచారం.
News October 16, 2025
నక్సలిజంపై పోరులో ల్యాండ్‌మార్క్ డే: అమిత్‌షా

ఛత్తీస్‌గఢ్‌లో ఇవాళ 170 మంది నక్సలైట్లు సరెండర్ అయ్యారని, నక్సలిజంపై పోరులో ల్యాండ్‌మార్క్ డే అని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వెల్లడించారు. ‘ఛత్తీస్‌గఢ్‌లోని అభూజ్మఢ్, నార్త్ బస్తర్ నక్సల్ టెర్రర్ నుంచి విముక్తి పొందాయి. 2024 JAN నుంచి 2,100 మంది నక్సలైట్లు సరెండరయ్యారు. 1,785 మంది అరెస్టయ్యారు. 477 మంది హతమయ్యారు. 2026 MAR 31లోపు నక్సలిజం అంతరిస్తుందనడానికి ఈ నంబర్లు నిదర్శనం’ అని ట్వీట్ చేశారు.