News September 23, 2025
దుల్కర్, పృథ్వీరాజ్ ఇళ్లల్లో కస్టమ్స్ సోదాలు

హీరోలు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ నివాసాల్లో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. స్మగ్లింగ్ ఆరోపణలపై ‘ఆపరేషన్ నుమ్‌ఖోర్’ పేరుతో కేరళ వ్యాప్తంగా సోదాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కొచ్చిలోని దుల్కర్, పృథ్వీరాజ్ నివాసాల్లో వాహనాల పత్రాలు పరిశీలించారు. పన్ను తప్పించుకునేందుకు భూటాన్ నుంచి లగ్జరీ కార్లను సెకండ్ హ్యాండ్ కార్లుగా కేరళ తెచ్చారన్న సమాచారంతో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 23, 2025
GST 2.0పై కేంద్రానికి ఫిర్యాదుల వెల్లువ!

GST కొత్త శ్లాబులు అమలులోకి వచ్చినా కొన్ని ఇ-కామర్స్ సైట్స్ ప్రయోజనాలను బదిలీ చేయట్లేదని కేంద్రానికి ఫిర్యాదులొచ్చాయి. వీటిపై కేంద్రం ఆరా తీస్తోంది. ‘ఈ ఫిర్యాదులపై వెంటనే స్పందించలేం. అన్ని సైట్లలో ధరల మార్పులను గమనిస్తున్నాం. సెప్టెంబర్ 30 కల్లా ఓ నివేదిక వస్తుంది’ అని కేంద్రం తెలిపింది. మీకూ ఇలాంటి అనుభవమే ఎదురైతే టోల్ ఫ్రీ నంబర్ 1915, www.consumerhelpline.gov.inలో ఫిర్యాదు చేయొచ్చు.
ShareIt.
News September 23, 2025
YCP చేసేవి తప్పుడు ఆరోపణలు: TDP

AP: ప్రజాధనంతో CM చంద్రబాబు 70సార్లు, మంత్రి లోకేశ్ 77సార్లు, Dy.CM పవన్ 122సార్లు గన్నవరం-HYD స్పెషల్ ఫ్లైట్స్‌లో తిరిగారని YCP చేసిన ఆరోపణలను TDP మండిపడింది. ‘అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడిన వీరు నిజమైన ప్రజాప్రతినిధులుగా ఉన్న వారిపై అభాండాలు వేయడం వారి దుష్ట సంస్కృతికి ఉదాహరణ. ఈ తప్పుడు ప్రచారాన్ని TDP ముక్తకంఠంతో ఖండిస్తోంది’ అని ట్వీట్ చేసింది.
News September 23, 2025
‘మారుతీ’ రికార్డు.. ఒకేరోజు 25 వేల కార్ల డెలివరీ

GST సంస్కరణల అమలు, పండగ సీజన్ నేపథ్యంలో దేశంలో కార్ల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. నిన్న ఒక్కరోజే 25 వేల కార్లు డెలివరీ ఇచ్చినట్లు మారుతీ సుజుకీ వెల్లడించింది. ఈనెల 18 నుంచి ఇప్పటివరకు 75 వేల బుకింగ్స్ వచ్చాయంది. 35 ఏళ్లలో ఇంతటి స్పందన ఎప్పుడూ చూడలేదని పేర్కొంది. మరోవైపు టాటా తొలి రోజు 10 వేల కార్లు డెలివరీ చేసింది. ఒకేరోజు 11 వేల అమ్మకాలు జరగడం ఐదేళ్లలో ఇదే తొలిసారి అని హ్యుందాయ్ వెల్లడించింది.