News October 14, 2024

టచ్ చేస్తే నరికేయండి.. అమ్మాయిలకు కత్తుల పంపిణీ

image

బిహార్‌లోని సీతామర్హికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే మిథిలేశ్ కుమార్ విద్యార్థినులకు కత్తులు పంపిణీ చేశారు. అమ్మాయిలను తాకిన దుర్మార్గుల చేతులను నరికేయాలని పిలుపునిచ్చారు. విజయదశమి వేడుకల్లో భాగంగా కత్తులు, తుపాకులు, ఇతర ఆయుధాలకు ఆయుధపూజ నిర్వహించారు. సోదరీమణులను తాకడానికి కూడా ఎవరూ ధైర్యం చేయకూడదని, చేస్తే నరికేయాలని స్పష్టం చేశారు. ఇలాంటి నిర్ణయాలకు ప్రజలూ మద్దతు తెలపాలని కోరారు.

Similar News

News January 25, 2026

లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కన్నుమూత

image

ఒడిశాకు చెందిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ అభిజిత్ మజుందార్(54) కన్నుమూశారు. BP, లివర్ సంబంధిత అనారోగ్య కారణాలతో ఆయన భువనేశ్వర్‌లోని AIIMSలో ఇవాళ తుదిశ్వాస విడిచారు. 2000వ సంవత్సరంలో ఒడియా చిత్ర పరిశ్రమలోకి ఎంటరైన అభిజిత్ దాదాపు 3దశాబ్దాలుగా ఎన్నో చిత్రాలకు మ్యూజిక్ అందించారు. సుమారు 700 పాటలను కంపోజ్ చేశారు. ఆయన మృతిపట్ల CM మోహన్ చరణ్, మాజీ CM నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

News January 25, 2026

చిన్న స్టెప్.. పెద్ద లాభం!

image

ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా? అయితే టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు ఇచ్చే టైపింగ్ సర్టిఫికెట్ తప్పక పొందండి. టైపిస్ట్, స్టెనో, క్లర్క్స్ తదితర ఉద్యోగాలకు డిగ్రీలతో పాటు ఈ సర్టిఫికేషన్ తప్పనిసరి. మనకు సూపర్ ఫాస్ట్ టైపింగ్ స్కిల్స్ ఉన్నా, వాటిని గుర్తించేలా ధ్రువీకరణ పత్రం కావాలి. కాబట్టి తక్కువ సమయమే పట్టే ఈ చిన్న మైల్‌స్టోన్ మీ క్వాలిఫికేషన్స్ లిస్ట్‌లో చేరితే ఎక్కువ జాబ్ ఆప్షన్స్ ఉంటాయి.
Share It

News January 25, 2026

ఆ ఛానల్ డిబేట్లలో పాల్గొనం: BRS

image

TG: ఏబీఎన్ ఛానల్‌లో జరిగే చర్చల్లో ఇకపై తమ పార్టీ నాయకులు పాల్గొనబోరని బీఆర్ఎస్ ప్రకటించింది. తెలంగాణ ఉద్యమకారుడు, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావుతో ఏబీఎన్ ప్రతినిధి వెంకటకృష్ణ వ్యవహరించిన తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పార్టీ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్‌, జిల్లా ఆఫీసుల్లో జరిగే సమావేశాలకు ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రతినిధులను ఇకపై అనుమతించబోమని ట్వీట్ చేసింది.