News June 17, 2024

లేటుగా వచ్చే ఉద్యోగుల సెలవుల్లో కోత పెట్టండి: కేంద్రం

image

ఉద్యోగుల హాజరుపై కఠినంగా వ్యవహరించాలని అన్ని ప్రభుత్వ శాఖలను కేంద్రం ఆదేశించింది. తరచూ ఆఫీసులకు లేటుగా రావడం, సమయం ముగియకముందే వెళ్లిపోవడాన్ని ఉపేక్షించరాదని పేర్కొంది. చాలామంది బయోమెట్రిక్ హాజరు వేయడం లేదని గుర్తించామంది. ఆలస్యంగా వచ్చిన, ముందుగా వెళ్లిపోతున్న వారి సెలవుల్లో కోత పెట్టాలంది. తగిన కారణాలుంటే నెలలో రెండుసార్లు, రోజుకు గంటకు మించకుండా లేటుగా రావడాన్ని క్షమించొచ్చని తెలిపింది.

Similar News

News November 27, 2025

ఆసిఫాబాద్ ఎస్ఈగా జాడే ఉత్తమ్ బాధ్యతల స్వీకరణ

image

ఎన్పిడిసిఇఎల్ సూపరింటెండింగ్ ఇంజినీర్‌గా జాడే ఉత్తమ్ బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ వెంకటేష్ ధోత్రేను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. మంచిర్యాలలో ఎస్ఈగా పనిచేసిన ఆయన బదిలీపై ఆసిఫాబాద్ వచ్చారు. మాజీ ఎస్ఈ శేషారావు ఆదిలాబాద్‌కు మారారు. జిల్లా వ్యాప్తంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తామని ఉత్తమ్ తెలిపారు.

News November 27, 2025

7,948 MTS, హవల్దార్ పోస్టులు

image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<>SSC<<>>) 7,948 MTS(నాన్ టెక్నికల్), హవల్దార్ ఖాళీల వివరాలను రీజియన్ల వారీగా ప్రకటించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్&కస్టమ్స్ (CBIC), సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్‌(CBN)లో ఈ పోస్టులు ఉన్నాయి. వీటిలో ఏపీలో 404, తెలంగాణలో169 పోస్టులు ఉన్నాయి. గతంలో 5,464 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. తాజాగా పోస్టులను జత చేసింది. త్వరలో పరీక్ష షెడ్యూల్‌ను ప్రకటించనుంది.

News November 27, 2025

రాజధాని రైతులతో చంద్రబాబు సమావేశం

image

AP: అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు సమావేశం అయ్యారు. ఇందులో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, జిల్లా కలెక్టర్ అన్సారియా పాల్గొన్నారు. గ్రామ కంఠాలు, జరీబు, అసైన్డ్, లంక భూములు, వీధిపోటు సమస్యలు, రాజధాని గ్రామాల్లో వసతులు, ఉద్యోగాల కల్పనపై చర్చించారు.