News August 21, 2024

వారి పెన్షన్లు కట్!

image

AP: బోగస్ సర్టిఫికెట్లతో పెన్షన్ పొందుతున్న వారికి ప్రభుత్వం షాక్ ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో 8 లక్షల మంది దివ్యాంగ పెన్షన్లు అందుకుంటుండగా అందులో అనర్హులు ఉన్నట్లు అధికారులు గుర్తించి ఇటీవల నోటీసులు జారీ చేశారు. 60వేల మందికి తిరిగి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. తాజాగా మంత్రి DBGV స్వామి సైతం బోగస్ సర్టిఫికెట్లు పెడితే పెన్షన్ల పంపిణీకి అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు.

Similar News

News December 4, 2025

అనుముల: ఇక్కడ నామినేషన్లు నిల్

image

అనుముల మండలం మొత్తం పంచాయతీ ఎన్నికల సందడిగా నెలకొనగా పేరూర్ గ్రామంలో అందుకు భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. పేరూర్ గ్రామ సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు కేటాయించగా గ్రామంలో ఆ సామాజిక వర్గానికి చెందిన మహిళా ఓటరు ఒక్కరూ లేరు. రెండో విడత జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల చివరి రోజు వరకూ సర్పంచ్ స్థానానికి, వార్డు స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.

News December 4, 2025

తన కన్నా అందంగా ఉండొద్దని.. మేనత్త దారుణం!

image

కుటుంబంలో తన కన్నా అందంగా ఎవ్వరూ ఉండొద్దని దారుణాలకు పాల్పడిందో మహిళ. ముగ్గురు కోడళ్లు, కొడుకును నీళ్లలో ముంచి హత్య చేసింది. పానిపట్‌(హరియాణా)లో పెళ్లివేడుకలో విధి(6) టబ్‌లో పడి చనిపోయింది. పోలీసుల దర్యాప్తులో మేనత్త పూనమ్ హత్య చేసిందని తేలింది. మరో 3హత్యలూ చేసినట్లు పూనమ్ ఒప్పుకుంది. 2023లో ఇషిక(9)ను చంపిన ఆమె తనపై అనుమానం రాకుండా కొడుకు శుభం(3)ను చంపేసింది. ఆగస్టులో జియా(6)ను పొట్టనపెట్టుకుంది.

News December 4, 2025

ఫిబ్రవరిలో పెళ్లి అని ప్రచారం.. స్పందించిన రష్మిక

image

నటి రష్మిక మందన్న-విజయ్ దేవరకొండ పెళ్లి వార్తలు కొంతకాలంగా వైరల్ అవుతూనే ఉన్నాయి. 2026 ఫిబ్రవరిలో రాజస్థాన్‌లో పెళ్లి జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ‘వివాహాన్ని నేను ధ్రువీకరించను. అలాగని ఖండించను. సమయం వచ్చినప్పుడు మాట్లాడతా. అంతకుమించి ఏమీ చెప్పను’ అని ప్రశాంతంగా సమాధానం ఇచ్చారు.