News June 24, 2024
వారి రేషన్ కార్డులు, పెన్షన్లు కట్: మంత్రి

TG: అనర్హులు పొందుతున్న రేషన్ కార్డులు, పెన్షన్లను తొలగిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాల్లో పేద కుటుంబాలకే ప్రథమ ప్రాధాన్యం ఉంటుందని అన్నారు. అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పారు. జులై 1 నుంచి ఆగస్టు చివరిలోపు అర్హత కలిగిన ప్రతి రైతుకూ రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని వివరించారు.
Similar News
News January 21, 2026
1.12 కోట్ల ఉద్యోగాలిచ్చేలా MSMEలకు కేంద్ర ప్రోత్సాహం

స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంటు బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ₹5,000 CR EQUITY సపోర్టుగా ఇవ్వాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. MSMEలకు రుణ ప్రోత్సాహంగా దీన్ని అమలు చేయనుంది. దీని ద్వారా 25.74 L సంస్థలకు లబ్ధి చేకూరి 1.12 కోట్ల ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తోంది. కాగా <<18915747>>అటల్ పెన్షన్<<>> యోజన స్కీమ్ను 2030–31 వరకు కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.
News January 21, 2026
తెలంగాణలో మున్సిపల్ కమిషనర్ల బదిలీలు

TG: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు చేపట్టింది. 36 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలన్న ఈసీ నిబంధనల మేరకు సొంత జిల్లాల్లో ఉన్నవారిని, ఒకే చోట మూడేళ్లు దాటిన వారిని మార్చేసింది. ప్రమోషన్లు, పరిపాలనా కారణాలతో జరిగిన ఈ బదిలీల్లో పలువురిని జీహెచ్ఎంసీకి పంపగా మరికొందరిని జిల్లాలకు బదిలీ చేసింది.
News January 21, 2026
‘బంగారు’ భవిష్యత్తు కోసం చిన్న పొదుపు!

ప్రస్తుతం బంగారం ధరలు సామాన్యుడికి భారంగా మారుతున్నాయి. అందుకే ఒకేసారి కొనలేకపోయినా ప్రతిరోజూ చిన్న మొత్తంలో డిజిటల్ గోల్డ్ కొనడం లేదా జువెలరీ షాపుల స్కీమ్స్లో చేరడం మంచిది. ఇప్పుడు గోల్డ్ SIPల ద్వారా రోజుకు రూ.30 నుంచే బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టొచ్చు. ఇలా జమ చేయడం వల్ల భవిష్యత్తులో పెరిగే ధరల లాభం మీకే దక్కుతుంది. భారీ పెట్టుబడి అవసరం లేకుండానే చిన్న పొదుపుతోనే ఎంతో కొంత బంగారం కొనొచ్చు.


