News October 29, 2024
యశ్ ‘టాక్సిక్’ షూటింగ్ కోసం చెట్లు నరికివేత: క్లారిటీ

కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ మూవీ వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ కోసం చిత్ర బృందం చెట్లు నరికివేస్తున్నట్లు కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖాండ్రే ఆరోపించారు. దీనిపై శాండల్వుడ్లో పెద్ద దుమారమే చెలరేగింది. కాగా శాటిలైట్ చిత్రాలను చూస్తుంటే అక్కడ చెట్లు కొట్టేసిన ఆనవాళ్లేమీ కనిపించడం లేదు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మూవీ టీమ్ సోషల్ మీడియాలో విడుదల చేసింది.
Similar News
News November 26, 2025
PDPL: గోదావరిఖని, మంథని స్టేషన్లలో డీసీపీ ఆకస్మిక తనిఖీలు

రామగుండం కమిషనరేట్ PDPL జోన్ డీసీపీ భూక్యా రామ్ రెడ్డి, ఏసీపీ ఎం.రమేష్తో కలిసి గోదావరిఖని సబ్డివిజన్లోని 2 టౌన్, కమాన్ పూర్, రామగిరి, మంథని, ముత్తారం పోలీస్ స్టేషన్లను సుడిగాలి పర్యటనలో పరిశీలించారు. కేసుల స్థితి, లా అండ్ ఆర్డర్, పెండింగ్ కేసులు, సీసీ కెమెరాలు, పెట్రోలింగ్, డయల్ 100 స్పందనపై సమీక్ష చేసి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ప్రజాభద్రత కోసం ప్రజలతో నేరుగా మమేకమై పని చేయాలని సూచించారు.
News November 26, 2025
సిద్దిపేట: ఇందిరమ్మ ఇళ్లలో అసలు లబ్ధిదారులే ఉండాలి: కలెక్టర్

నిర్మాణం పూర్తైన రెండు పడక గదుల (డబుల్ బెడ్రూమ్) ఇందిరమ్మ ఇళ్లలో అసలు లబ్ధిదారులు మాత్రమే ఉండేలా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ కె.హైమావతి అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ పథకాల అమలు, లబ్ధిదారుల ప్రయోజనంపై మంగళవారం తహశీల్దార్, గృహ నిర్మాణ శాఖ, ఇంజినీరింగ్ అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు.
News November 26, 2025
విశాఖ ఉమెన్స్ కాలేజీలో 28న మెగా జాబ్ మేళా

విశాఖలోని ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీలో 28న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు కాలేజీ ఆవరణలో పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రముఖ ఐటీ కంపెనీలు, పరిశ్రమల యాజమాన్య నిర్వాహకులు జాబ్ మేళాలో పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. యువతీ యువకులు అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.


