News March 19, 2024
నేడు CWC సమావేశం

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఇవాళ సాయంత్రం 4 గంటలకు జరగనుంది. ఢిల్లీలో AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ భేటీలో లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో, రైతులు, మహిళలు, యువత, బలహీన వర్గాలకు సంబంధించిన హామీలపై చర్చించే అవకాశం. ఇవాళ్టి భేటీలో తెలంగాణ సహా పలు రాష్ట్రాల అభ్యర్థులను ఖరారు చేసే ఛాన్స్ ఉంది.
Similar News
News January 31, 2026
ఢిల్లీ హైకోర్టులో 152 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News January 31, 2026
మొక్కజొన్నలో జింక్ లోపం – నివారణ

వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, మోతాదుకు మించి భాస్వరం ఎరువులను వాడినప్పుడు, అధిక నీటి ముంపునకు గురైనప్పుడు మొక్కజొన్నలో జింక్ లోపం కనబడుతుంది. దీని వల్ల ఆకుల, ఈనె మధ్య భాగాలు పాలిపోయిన పసుపు, తెలుపు రంగుగా మారతాయి. పంట ఎదుగుదల ఆశించినంతగా ఉండదు. జింక్ లోపం నివారణకు లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను కలిపి 4-5 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
News January 31, 2026
స్పటిక మాలను ఎందుకు ధరించాలి?

స్పటిక మాలను ధరిస్తే మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరుగుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం.. ఇది శుక్ర గ్రహాన్ని బలపరిచి సంపద, కీర్తి, ఆకర్షణను ప్రసాదిస్తుంది. లక్ష్మీ దేవి అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులు తొలగి శ్రేయస్సు సిద్ధిస్తుంది. ఇది శరీరంలోని వేడిని తగ్గించి మనస్సును చల్లబరుస్తుంది. మనస్సును నిగ్రహించుకోవడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. క్రమం తప్పకుండా నియమాలు పాటిస్తూ ధరిస్తే సానుకూల శక్తి పెరుగుతుంది.


