News October 16, 2025
WWC25: సెమీ ఫైనల్‌కు ఆస్ట్రేలియా

ఉమెన్స్ ODI WC-2025లో సెమీ ఫైనల్ చేరిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. ఇవాళ బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత BAN 198/9 స్కోర్ చేయగా, AUS 24.5 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించింది. అలీసా హీలీ(113) సెంచరీతో మెరిశారు. లిచ్‌ఫీల్డ్(84) హాఫ్ సెంచరీ చేశారు. ఈ ఇన్నింగ్స్‌లో హీలీ 20 ఫోర్లు బాదడం విశేషం. కాగా భారత్‌పై మ్యాచులోనూ హీలీ(142) అద్భుత సెంచరీ చేశారు.
Similar News
News October 17, 2025
రోజుకు 5KM పరుగు… అయినా 2 స్టెంట్లు

రోజుకు 5 కి.మీ పరిగెత్తడం అతడి దినచర్య. నిద్ర, ఆహార నియమాలను తూ.చ పాటిస్తుంటాడు. 15 ఏళ్లుగా ఇదే పాటిస్తున్న కార్తీక్ శ్రీనివాసన్ అనే వ్యక్తి చేసిన ట్వీట్ వైరలవుతోంది. హఠాత్తుగా అస్వస్థత అనిపించడంతో యాంజియోగ్రామ్ చేస్తే హార్ట్‌లో 2 బ్లాక్స్ ఉన్నట్లు తేలిందని, స్టెంట్లు వేశారని ఆయన పేర్కొన్నాడు. జాగ్రత్తలు తీసుకున్నా గుండె లయ తప్పిందన్నాడు. గుండె ఆరోగ్యం అనేక అంశాలతో ముడిపడి ఉంటుందనుకోవాలన్నాడు.
News October 17, 2025
గంభీర్‌తో రోహిత్.. క్యాప్షన్ ప్లీజ్!

టీమ్ ఇండియా కెప్టెన్సీ చేజారిన తర్వాత రోహిత్ శర్మ తొలిసారి కోచ్ గౌతమ్ గంభీర్‌తో కలిసి కనిపించారు. ఆస్ట్రేలియాలో ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా గంభీర్.. హిట్‌మ్యాన్‌కు సలహాలు ఇచ్చారు. రోహిత్ సీరియస్‌గా చేతులు కట్టుకుని కోచ్ మాటలు విన్నారు. అంతకుముందు రోహిత్ శర్మ.. హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, లోకల్ బౌలర్లను ఎదుర్కొన్నారు. పై ఫొటోకు మీ క్యాప్షన్ ఏంటో కామెంట్ చేయండి.
News October 16, 2025
ధన త్రయోదశి.. ఈ వస్తువులు కొనవద్దు

దీపావళికి రెండ్రోజుల ముందు వచ్చే ధన త్రయోదశి రోజు (OCT 18) వెండి, బంగారం కొంటే మంచి జరుగుతుందనే నమ్మకం ఉంది. ఇదే సమయంలో కొన్నింటిని ఆరోజు కొనవద్దని పురోహితులు చెబుతున్నారు. ఇనుము శనికి చిహ్నం కావడంతో ఆరోజు కొనొద్దని అంటున్నారు. అలాగే గాజు (రాహు), స్టీల్, సూదులు, కత్తులు, కత్తెరలు వంటి పదునైన వస్తువులు, నెయ్యి, నూనె, నల్ల రంగు దుస్తులు లేదా సామాగ్రి జోలికి వెళ్లొద్దని సూచిస్తున్నారు. Share It