News September 20, 2025
ఎయిర్‌పోర్టులపై సైబర్ అటాక్.. విమాన సర్వీసులపై ఎఫెక్ట్

యూరప్‌లోని పలు ఎయిర్‌పోర్టులపై సైబర్ అటాక్ జరిగింది. లండన్, బ్రస్సెల్స్, బెర్లిన్ విమానాశ్రయాల్లోని చెకింగ్ వ్యవస్థలను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. దీంతో అక్కడి నుంచి వివిధ దేశాలకు ప్రయాణించే విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. <<17769573>>రేపటిలోగా<<>> US వెళ్లాల్సిన H1B వీసాదారుల్లో ఈ సైబర్ అటాక్ మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇటు మనదేశానికి రావాల్సిన విమాన సర్వీసులు కూడా ప్రభావితమైనట్లు తెలుస్తోంది.
Similar News
News September 20, 2025
H1B వీసా: 2 గంటల్లోనే భారీగా పెరిగిన టికెట్ ధర

H1B వీసాదారులు రేపటిలోగా USలో ఉండాలన్న <<17769573>>నిబంధనను<<>> విమానయాన సంస్థలు భారీగా సొమ్ము చేసుకుంటున్నాయి. ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్లేందుకు ఇప్పటివరకు టికెట్ ధర రూ.34-37వేలు ఉండగా దాన్ని రూ.70-80వేలకు పెంచాయి. ట్రంప్ ప్రకటన వెలువడిన 2 గంటల్లోనే ధరలు భారీగా పెంచడం గమనార్హం. దుర్గాపూజ కోసం చాలామంది వీసాదారులు US నుంచి INDకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వారంతా ఉరుకులు పరుగుల మీద USకు బయల్దేరుతున్నారు.
News September 20, 2025
ఈ-పంట ఆధారంగా హెక్టారుకు రూ.50 వేలు: సీఎం

AP: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే ప్రభుత్వం తమది అని సీఎం CBN తెలిపారు. ‘ఉల్లి రైతులకు నష్టం జరగకుండా హెక్టారుకు రూ.50వేలు చెల్లించాలని నిర్ణయించాం. దీంతో 45వేల ఎకరాల ఉల్లి రైతులకు లబ్ధి చేకూరుతుంది. పంట పూర్తిగా సిద్ధం అయిన తర్వాత ఆరబెట్టి, గ్రేడింగ్ చేసి మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. వారి పంటతో సంబంధం లేకుండానే ఈ-పంట ఆధారంగా హెక్టారుకు రూ.50వేలు చెల్లిస్తాం’ అని CM ప్రకటించారు.
News September 20, 2025
BREAKING: మోహన్‌లాల్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ వరించింది. 2023 సంవత్సరానికి గానూ కేంద్రం ఆయన్ను ఎంపిక చేసింది. ఈ నెల 23న జరిగే 71వ జాతీయ సినిమా అవార్డుల ప్రదానోత్సవంలో ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. మోహన్‌లాల్ మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ, తమిళ భాషల్లో నటించి మెప్పించారు.