News January 28, 2025

డీప్‌సీక్‌ AIపై సైబర్ అటాక్స్.. రిజిస్ట్రేషన్లు నిలిపివేత

image

సైబర్ దాడుల నేపథ్యంలో కొత్త యూజర్ల రిజిస్ట్రేషన్లను తాత్కాలికంగా ఆపేస్తున్నామని చైనీస్ స్టార్టప్ డీప్‌సీక్ తెలిపింది. పాత యూజర్లు నిరభ్యంతరంగా తమ AIను వాడుకోవచ్చని సూచించింది. ChatGPT, Gemini వంటి AI యాప్స్‌కు డీప్‌సీక్ పెనుసవాళ్లు విసురుతోంది. కొత్త వెర్షన్ విడుదలయ్యాక అనేక దేశాల్లో దీనినే ఎక్కువగా వాడుతున్నారు. అమెరికాలో APPLE యాప్‌స్టోర్‌లో ఎక్కువ డౌన్‌లోడ్ చేసుకున్న ఫ్రీ యాప్‌గా నిలిచింది.

Similar News

News November 23, 2025

బాపట్ల: 2.50 లక్షల గోనె సంచులు సిద్ధం

image

ధాన్యం సేకరణలో రవాణా ఛార్జీలు ప్రభుత్వమే భరిస్తుందని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట తెలిపారు. 1,200 వాహనాలు అవసరం కానున్నాయని అంచనా వేశామన్నారు. ఇప్పటికే 450 వాహనాలు పోర్టల్‌లో నమోదు చేసుకున్నారని, ప్రతి వాహనానికి జిపిఎస్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. 2.50 లక్షల గోనె సంచులు సిద్ధంగా ఉంచామన్నారు. మిల్లర్ల వద్ద మరో 10లక్షల గోనె సంచులు ఉన్నాయన్నారు.

News November 23, 2025

సామ్ కరన్ ఎంగేజ్‌మెంట్

image

ఇంగ్లండ్ క్రికెటర్ సామ్ కరన్ తన ప్రియురాలు ఇసాబెల్లా గ్రేస్‌ను పరిచయం చేశారు. ఆమెకు పెళ్లి ప్రపోజ్ చేస్తూ, ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు ప్రకటించారు. వీరు తొలిసారిగా 2018లో పరిచయమయ్యారు. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఇసాబెల్లా 1998న ఇంగ్లండ్‌లో జన్మించారు. థియేటర్ ఆర్టిస్టుగా పని చేస్తున్నారు. అటు సామ్ కరన్ వచ్చే సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడనున్నారు.

News November 23, 2025

పిల్లలు బరువు తగ్గుతున్నారా?

image

పిల్లలు పుట్టినప్పుడు సరైన బరువుతో ఉన్నా ఆ తర్వాత బరువు తగ్గిపోతున్నారని చాలామంది పేరెంట్స్ వైద్యులను సంప్రదిస్తుంటారు. ఇది సాధారణమే అంటున్నారు నిపుణులు. పుట్టినప్పుటి బరువులో 6-7 శాతం వరకు తగ్గుతారట. డబ్బా పాలు తాగేవారిలో 3-4 శాతం తగ్గుదల కనిపిస్తుంది. చిన్నారులు పుట్టినప్పటి బరువుతో పోలిస్తే ఐదు నుంచి ఆరు నెలల తర్వాత రెట్టింపు బరువు పెరిగితే వారు ఆరోగ్యంగా ఉన్నట్లేనని చెబుతున్నారు.