News March 27, 2025
రాత్రి 7.30కు పవర్ కట్ అంటూ సైబర్ మోసం

TG: సైబర్ నేరగాళ్లు కొత్త మోసంతో మాయ చేస్తున్నారు. ‘మీరు గత నెల కరెంట్ బిల్ చెల్లించలేదు. ఇవాళ రాత్రి 7.30కు పవర్ కట్ అవుతుంది’ అని పలువురు వినియోగదారుల మొబైల్స్‌కు మెసేజ్‌లు పంపుతున్నారు. దీనిపై విద్యుత్ శాఖ వర్గాలు స్పందించాయి. TGSPDCL ఎప్పుడూ ఇలాంటి మెసేజ్‌లు పంపదని, ఉద్యోగులెవరూ వినియోగదారుల బ్యాంక్ ఖాతా నంబర్లు తీసుకోరని స్పష్టం చేశాయి. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించాయి.
Similar News
News March 30, 2025
వార్న్ మరణంలో కొత్త కోణం

దిగ్గజ బౌలర్ షేన్ వార్న్ మరణంలో మరో కోణం తెరపైకి వచ్చింది. ఆయన మరణించిన విల్లాలో లైంగిక సామర్థ్యానికి సంబంధించిన ఓ మెడిసిన్‌ను గుర్తించినట్లు బ్రిటన్ మీడియా పేర్కొంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో దానిని తొలగించారని కథనంలో పేర్కొంది. ఆ వ్యవహారాన్ని కప్పిపుచ్చడంలో ఆస్ట్రేలియా అధికారుల పాత్ర ఉండవచ్చని ఆ విల్లాకు వెళ్లిన ఓ పోలీసు అధికారి తాజాగా తెలిపాడు. 2022లో థాయ్‌లాండ్‌లో వార్న్ హఠాన్మరణం చెందారు.
News March 30, 2025
టెన్త్ పాసై ఈత వస్తే ప్రభుత్వ ఉద్యోగాలు

నేవీలో 327 బోట్ క్రూ స్టాఫ్ (గ్రూప్ C) పోస్టుల దరఖాస్తుకు ఏప్రిల్ 1తో గడువు ముగియనుంది. 57 సిరాంగ్ ఆఫ్ లాస్కర్స్, 192 లాస్కర్-1, 73 ఫైర్‌మ్యాన్ (బోట్ క్రూ), 5 టోపాస్ పోస్టులు ఉన్నాయి. అన్ని పోస్టులకు పదో తరగతి పాస్ కావడంతో పాటు ఈత రావాలి. లాస్కర్ సిరాంగ్ పోస్టులకు అదనంగా రెండేళ్లు, లాస్కర్-1 పోస్టులకు ఒక ఏడాది అనుభవం ఉండాలి. వయసు: 18-25 ఏళ్లు. పూర్తి వివరాలకు సైట్: joinindiannavy.gov.in/
News March 30, 2025
రంజాన్ లౌకికవాదానికి ప్రతీక: సీఎం రేవంత్

TG: ముస్లింలకు సీఎం రేవంత్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘రంజాన్ లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఖురాన్ ఉద్భవించిన రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షలు, క్రమశిక్షణతో నిర్వహించే ప్రార్థనలు, జకాత్, ఫిత్రా పేరుతో పేదలకు చేసే దానధర్మాలు మానవాళికి ఆదర్శం. గంగా జమునా తెహజీబ్‌కు తెలంగాణ ప్రతీక. ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుంది’ అని తెలిపారు.