News August 24, 2025
WhatsAppలో సైబర్ మోసాలు.. అలర్ట్!

AP: గుంటూరుకు చెందిన ఓ వ్యక్తిని సైబర్ కేటుగాళ్లు మోసం చేశారు. ‘మీ వాహనంపై చలానా ఉంది. వెంటనే చెల్లించండి’ అంటూ శుక్రవారం వాట్సాప్‌లో APK ఫైల్ మెసేజ్ చేశారు. ఆ లింక్ క్లిక్ చేయగానే ఓ యాప్ డౌన్‌లోడ్ అయింది. అది ఓపెన్ చేయగానే OTP అడిగింది. ఆ ప్రక్రియను ఆపేసినా అతడి ఖాతా నుంచి రూ.1.36 లక్షలు కాజేశారు. APK ఫైల్స్ ఓపెన్ చేయొద్దని, WhatsAppలో Auto-download ఆఫ్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Similar News
News December 29, 2025
‘స్పిరిట్’ నుంచి న్యూఇయర్ సర్‌ప్రైజ్?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో ‘స్పిరిట్’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇటీవల ఫొటో షూట్ పూర్తి చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. న్యూ ఇయర్ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసే అవకాశం ఉందని చెప్పాయి. దీనిపై మూవీ టీమ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు ఆదివారం ‘రాజాసాబ్’ రెండో ట్రైలర్ రిలీజ్ చేస్తామని మేకర్స్ వెల్లడించారు. కానీ విడుదల కాలేదు.
News December 29, 2025
చివరి దశలో చర్చలు.. ఏం జరుగుతుందో: ట్రంప్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై చర్చలు చివరి దశలో ఉన్నాయని, ఏం జరుగుతుందో చూడాలని US అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. కీలక చర్చల కోసం ఫ్లోరిడాకు వచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని ఆయన ఆహ్వానించారు. 2 దేశాలు శాంతిని కోరుకుంటున్నాయని చెప్పారు. పుతిన్, జెలెన్‌స్కీ ఒప్పందం చేసుకునేందుకు రెడీగా ఉన్నారని తెలిపారు. భేటీకి ముందు ట్రంప్, పుతిన్ ఫోన్‌లో మాట్లాడారు. మీటింగ్ తర్వాతా మాట్లాడనున్నారు.
News December 29, 2025
డిసెంబర్ 29: చరిత్రలో ఈరోజు

✒1530: బాబర్ పెద్దకొడుకు హుమయూన్ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు ✒1953: రాష్ట్రాల పునర్విభజన విషయమై ఫజల్‌ఆలీ కమీషన్ ఏర్పాటు
✒1965: మొదటి యుద్ధట్యాంకు వైజయంత ఆవడి తయారుచేసిన భారత్
✒1974: సినీ నటి, రచయిత్రి ట్వింకిల్ ఖన్నా జననం
✒1910: ఆర్థికవేత్త రోనాల్డ్ కోస్ జననం
✒2022: బ్రెజిల్ ఫుట్‌బాల్ ఆటగాడు పీలే మరణం(ఫొటోలో)


