News March 27, 2024
ప్రతి ఆరుగురిలో ఒక చిన్నారిపై సైబర్ వేధింపులు: WHO

చిన్నారులపై సైబర్ వేధింపుల గురించి WHO నివేదిక విడుదల చేసింది. 11-15yrs మధ్య చిన్నారుల్లో ప్రతి ఆరుగురిలో ఒకరిపై సైబర్ వేధింపులు జరుగుతున్నట్లు వెల్లడించింది. 15% అబ్బాయిలు, 16% అమ్మాయిలు ఇటీవల ఒక్కసారైనా ఈ వేధింపులకు గురైనట్లు తెలిపింది. బల్గేరియా, లిథువేనియా, మల్డోవా, పోలాండ్ ముందుండగా.. స్పెయిన్ చివర్లో ఉంది. చిన్నారులు నిత్యం 6గంటలు ఫోన్లలో గడుపుతున్నట్లు పేర్కొంది.
Similar News
News March 23, 2026
విపక్షాల ట్రాప్‌లో పడొద్దు: రేవంత్

TG: మూసీ నిర్వాసితులకు అన్యాయం చేయబోమని సీఎం రేవంత్ అసెంబ్లీలో పునరుద్ఘాటించారు. వారికి మెరుగైన వసతులతో పునరావాసం కల్పిస్తామని, విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. మహిళలు వ్యాపారాలు చేసుకోవడానికి సహకరిస్తామన్నారు. విపక్షాల ట్రాప్‌లో పడొద్దని వారికి సూచించారు.
News March 23, 2026
మూసీ ప్రక్షాళనపై సలహాలు స్వీకరిస్తాం: సీఎం రేవంత్

TG: మూసీ ప్రక్షాళన అత్యవసరమని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ‘గుజరాత్‌లో సబర్మతి ప్రక్షాళనకు కాంగ్రెస్ సహకరించింది. HYDలో మూసీ అభివృద్ధికి రాజకీయ రంగు ఎందుకు? అడ్డుకోవడం తప్పించి ఏ సలహా ఇచ్చినా తీసుకుంటాం. నాకు చెప్పడానికి ఇబ్బందైతే మంత్రులతో కమిటీ వేస్తా. వాళ్లకైనా మీ అభిప్రాయాలు చెప్పండి’ అని సూచించారు.
News March 23, 2026
సంచలనం.. ఇకపై సిలిండర్‌లో 10 కేజీల గ్యాస్?

గ్యాస్ సరఫరాలో సమస్యలతో రీఫిల్లింగ్ సైజ్‌ను తగ్గించాలని ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు యోచిస్తున్నట్లు ToI వెల్లడించింది. 14.2KGల సిలిండర్లలో 10KGల గ్యాస్‌నే(రేటు తగ్గించి) అందించే అవకాశం ఉందని తెలిపింది. ‘చిన్న ఫ్యామిలీకి 14.2KGల సిలిండర్ 35-40 రోజులు వస్తుంది. 10 కేజీలైతే నెలపాటు సరిపోతుంది. దీనివల్ల కొరత రాదు. ఈ సమయంలో కంపెనీలు నిల్వలను పెంచుకునే వీలుంటుంది’ అని ఓ అధికారి చెప్పినట్లు పేర్కొంది.


