News October 30, 2025
తుఫానుతో రూ.5,265 కోట్ల నష్టం: చంద్రబాబు

AP: ‘మొంథా’ తుఫాను వల్ల రాష్ట్రానికి రూ.5,265 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా వేసినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. అత్యధికంగా ఆర్‌అండ్‌బీకి రూ.2,079 కోట్లు, ఆక్వా రంగానికి రూ.1,270 కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.829 కోట్ల నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. అయితే ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోలేదని వెల్లడించారు. ముందస్తు చర్యలతో నీటిపారుదల శాఖకు తక్కువ నష్టమే వాటిల్లిందని తెలిపారు.
Similar News
News October 30, 2025
కల్తీ నెయ్యి సరఫరాలో భారీ కుట్ర: సిట్

AP: తిరుమల కల్తీ నెయ్యి సరఫరా వెనుక భారీ కుట్ర ఉందని సిట్ తేల్చింది. ఈ అక్రమాల్లో వైవీ సుబ్బారెడ్డి సన్నిహితుడు <<16598439>>చిన్నఅప్పన్న<<>>కు భారీగా కమీషన్ ముట్టినట్లు అధికారులు గుర్తించారు. ఆయన అరెస్టుతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్లాన్ ప్రకారం భోలేబాబా డెయిరీని తప్పించి ప్రీమియర్ అగ్రిఫుడ్స్ కాంట్రాక్టు దక్కించుకునేలా చేశారని తేలింది.
News October 30, 2025
టెస్టుల్లో కొత్త సంప్రదాయం.. ఇక రెండు టీ బ్రేకులు!

టెస్టుల్లో సరికొత్త సంప్రదాయానికి తెరలేవనుంది. గువాహటి వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే తొలి టెస్ట్ నుంచి 2 టీ బ్రేక్స్ అమలు కానున్నాయని తెలుస్తోంది. ఫస్ట్ సెషన్ 9-11am, సెకండ్ సెషన్ 11-20am-1.20pm, మూడో సెషన్ 2-4pmగా ఉండనుందని క్రీడా వర్గాలు తెలిపాయి. లంచ్‌కు ముందు ఒకటి, తర్వాత మరో టీ బ్రేక్ అమల్లోకి రానుందని వెల్లడించాయి. ప్రస్తుతం లంచ్ తర్వాత మాత్రమే టీ బ్రేక్ ఉన్న సంగతి తెలిసిందే.
News October 30, 2025
అజహరుద్దీన్‌కు మంత్రి పదవి.. మీరేమంటారు?

TG: అజహరుద్దీన్ మంత్రి కావడానికి టైం ఫిక్స్ అయింది. కాగా మంత్రివర్గ విస్తరణ సమయాల్లో గతంలో లేనంతగా కాంగ్రెస్ తాజా నిర్ణయం కాక రేపుతోంది. దేశ ద్రోహికి మంత్రి పదవి ఎలా ఇస్తారని BJP.. ఓ సామాజికవర్గం ఓట్ల కోసం కాంగ్రెస్ దిగజారిందని BRS ధ్వజమెత్తాయి. అయితే అజహరుద్దీన్ క్రికెట్‌లో దేశానికి పేరు తెచ్చారని, ఆయనకు పదవి రాకుండా ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని కాంగ్రెస్ చెబుతోంది. దీనిపై మీరేమంటారు.


