News December 20, 2024

బంగాళాఖాతంలో వాయుగుండం.. భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది విశాఖకు 450 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాకు భారీ వర్షసూచన ఉన్నట్లు వెల్లడించింది. అల్లూరి, కాకినాడ, అనకాపల్లి, విశాఖ, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. అన్ని పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

Similar News

News October 30, 2025

మొంథా తుఫాను.. రేపు పార్టీ నేతలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్‌

image

AP: మొంథా తుఫాను నేపథ్యంలో YCP రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులతో రేపు ఉ.11 గంటలకు ఆ పార్టీ చీఫ్ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. తుఫాను తర్వాత ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను జిల్లా అధ్యక్షులు ఆయనకు వివరించనున్నట్లు YCP వెల్లడించింది. బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా ఒత్తిడి తీసుకురావడంపై పార్టీ నాయకులకు జగన్ దిశానిర్దేశం చేస్తారని పేర్కొంది.

News October 30, 2025

‘స్పిరిట్‌’లో డాన్ లీ?.. కొరియన్ మీడియాలో వార్తలు!

image

ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్’ మూవీని సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కొరియన్ స్టార్ డాన్ లీ నటిస్తున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ ఇటీవల రిలీజ్ చేసిన సౌండ్ స్టోరీలో డాన్ లీ గురించి ప్రస్తావించలేదు. దీంతో అవి పుకార్లేనని అంతా భావించారు. ఈ క్రమంలో స్పిరిట్‌లో డాన్ నటిస్తున్నారని కొరియన్ మీడియా సంస్థలు చెబుతున్నాయి. ఆయన కనిపించే తొలి ఇండియన్ మూవీ ఇదేనంటున్నాయి.

News October 30, 2025

మైనార్టీకి మంత్రి పదవి ఇస్తాం: టీపీసీసీ చీఫ్

image

TG: కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని, అందుకే మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వాలనుకున్నట్లు TPCC చీఫ్ మహేశ్ కుమార్ తెలిపారు. <<18140326>>మంత్రి<<>> పదవికి అజహరుద్దీన్ పేరు ఫైనల్ అయినట్లుగా తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. జూబ్లీహిల్స్‌లో మైనార్టీల మీటింగ్ కోసమే అజహరుద్దీన్ తనను కలిశారని చెప్పారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వం మరో మూడు నెలల్లో కూలుతుందన్న బీజేపీ ఇక చిలుక జోస్యం చెప్పుకోవాల్సిందేనని సెటైర్లు వేశారు.