News August 19, 2025

తీరం దాటిన వాయుగుండం.. భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి ఒడిశాలోని గోపాల్‌పూర్ సమీపంలో తెల్లవారుజామున తీరం దాటినట్లు APSDMA తెలిపింది. దీని ప్రభావంతో కోస్తా, ఉత్తరాంధ్రలోని కృష్ణా, ఏలూరు, అల్లూరి, వైజాగ్, ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఈ నెల 24న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Similar News

News August 19, 2025

ఆసియా కప్‌కు భారత జట్టు ఇదే

image

దుబాయ్ వేదికగా వచ్చే నెల 9 నుంచి స్టార్ట్ కానున్న ఆసియా కప్‌కు BCCI భారత జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కలేదు. ఈ టోర్నమెంట్ టీ20 ఫార్మాట్‌లో జరగనుంది.
జట్టు: సూర్య(C), గిల్(VC), అభిషేక్, శాంసన్, పాండ్య, తిలక్, దూబే, జితేశ్, రింకూ, చక్రవర్తి, అక్షర్, బుమ్రా, అర్ష్‌దీప్, కుల్దీప్, హర్షిత్ రాణా.
స్టాండ్‌బై: జైస్వాల్, ప్రసిద్, జురెల్, రియాన్ పరాగ్, సుందర్.

News August 19, 2025

సుదర్శన్ రెడ్డి ఎంపికకు కారణమిదేనా?

image

విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా <<17451888>>బి.సుదర్శన్‌రెడ్డి<<>> ఎంపిక వ్యూహాత్మక నిర్ణయమని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయేతర వ్యక్తిని బరిలో దింపడంతో NDAతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలను ఇరకాటంలో పెట్టినట్లైందంటున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని TDP, YSRCP, BRS పార్టీలపై ఒత్తిడి తెచ్చేందుకే తెలుగు వ్యక్తిని ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. సుదర్శన్‌రెడ్డి CM చంద్రబాబుకు సన్నిహితుడు కావడం గమనార్హం.

News August 19, 2025

కేబుల్, ఇంటర్నెట్ వైర్లు కట్

image

TG: హైదరాబాద్‌లో విద్యుత్ స్తంభాలపై పర్మిషన్ లేకుండా ఏర్పాటు చేసిన కేబుల్, ఇంటర్నెట్ వైర్లను తొలగిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో TGSPDCL సిబ్బంది యుద్ధప్రాతిపదికన వాటిని కట్ చేస్తున్నారు. <<13977633>>ఏడాది సమయం<<>> ఇచ్చినా ఆపరేటర్లు స్పందించలేదని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం సరికాదని హెచ్చరించారు.