News May 23, 2024
పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాన్ని తాకనున్న తుఫాన్: IMD

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమేపి తుఫాన్‌గా మారనుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ తుఫాన్ ఆదివారం సాయంత్రం కల్లా పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతాలను తాకనున్నట్లు IMD తెలిపింది. తీరాన్ని తాకే సమయంలో 102 KMPH వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. వర్షాకాలం ప్రారంభానికి ముందు బంగాళాఖాతంలో ఏర్పడనున్న తొలి తుఫాన్ ఇదే కానుంది.
Similar News
News February 6, 2026
బాలికల మిస్సింగ్ కేసులు పెరగలేదు: ఢిల్లీ పోలీసులు

ఢిల్లీలో బాలికల మిస్సింగ్ కేసులు పెరిగాయన్న ప్రచారాన్ని పోలీసులు ఖండించారు. పెయిడ్ ప్రమోషన్లతో కొందరు ఈ అంశానికి హైప్ తీసుకొస్తున్నారని, ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కాగా JAN 1 నుంచి 15 మధ్య 509 మంది బాలికలు, మహిళలు తప్పిపోయినట్లు పోలీసుల డేటా వెల్లడించిందని జాతీయ మీడియా పేర్కొంది. అయితే 2025తో పోలిస్తే ఈ సంఖ్య తక్కువని, కేసులు పెరగలేదని పోలీసులు స్పష్టం చేశారు.
News February 6, 2026
సీఎం ముఖ్య కార్యదర్శిగా ఎంకే మీనా?

AP: సీఎం చంద్రబాబు ముఖ్య కార్యదర్శిగా ముకేశ్ కుమార్ మీనా నియమితులు కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన గనులు, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. అంతకుముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గానూ విధులు నిర్వర్తించారు. కాగా ఇప్పటివరకు CM ముఖ్యకార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్రకు TTD EOగా అదనపు బాధ్యతలు ఇచ్చిన విషయం తెలిసిందే. కల్తీ నెయ్యి వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న TTD EO సింఘాల్‌ను బదిలీ చేశారు.
News February 6, 2026
30వారాల గర్భాన్ని తొలగించేందుకు సుప్రీం అనుమతి!

బాయ్ ఫ్రెండ్ వల్ల 17ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్ అయిన ఓ అమ్మాయి 30 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. తన శరీరానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే హక్కు సదరు యువతికే ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇష్టం లేని గర్భాన్ని దాల్చాలని ఏ స్త్రీని బలవంతం చేయలేమని జడ్జీలు పేర్కొన్నారు. బాధితురాలి మానసిక స్థితిని పరిగణనలోకి తీసుకుని వెంటనే అబార్షన్ చేయాలని కోర్టు ఆదేశించింది.


