News September 20, 2025
D.ed విద్యార్థులకు రేపటి నుంచి సెలవులు

D.ed విద్యార్థులకు ఈనెల 21 నుంచి అక్టోబర్ 3 వరకు సెలవులు ఉంటాయని గోపాల్‌పేట్ మండలంలోని డైట్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు యాదవ్ తెలిపారు. అక్టోబర్ 4న కళాశాల పునః ప్రారంభం కానున్నదని అన్నారు. దసరా సెలవులను విద్యార్థులు ఆటపాటలతో గడపడంతో పాటు కొంత సమయాన్ని విజ్ఞాన సముపార్జనకు వినియోగించుకోవాలన్నారు. ఈనెల 22 నుంచి 27 డీఈడీ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఉంటాయన్నారు.
Similar News
News September 20, 2025
మెదక్: మంత్రిని కలిసిన ఆరోగ్యశ్రీ ఆస్పత్రి ప్రతినిధులు

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవలను యథావిధిగా కొనసాగిస్తామని, ప్రభుత్వానికి తమ పూర్తి సహకారం ఉంటుందని హాస్పిటల్స్ ప్రతినిధులు హామీ ఇచ్చారు. వారు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటళ్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
News September 20, 2025
ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి సుభాశ్

రామచంద్రపురంలో కృత్తివెంటి పేర్రాజు పంతులు ప్రభుత్వ పాఠశాలను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. 9,10 తర్వాత విద్యార్థులకు మంత్రి కౌన్సెలింగ్ నిర్వహించారు. మాదకద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని, వాటి బారిన పడితే భవిష్యత్తు అంధకారమేనని విద్యార్థులకు హితవు పలికారు. తల్లిదండ్రుల ఆశలను వమ్ము చేయొద్దని, మంచి భవిష్యత్తు పొందేలా శ్రద్ధగా చదవాలని సూచించారు.
News September 20, 2025
వీరి చలపతి అరెస్ట్‌తో వైసీపీలో కలకలం

నెల్లూరు జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి వీరి చలపతిని పోలీసులు శనివారం అరెస్ట్ చేయడంతో జిల్లాలోని వైసీపీ వర్గాల్లో కలకలం రేగింది. జిల్లాలోని వైసీపీ కీలక నేతల్లో అయన ఒకరు. ఈ నేపథ్యంలో అయన అరెస్టయ్యారు. ఇప్పటికే విడవలూరు, కొడవలూరు నుంచి అయన అనుచరులు నెల్లూరుకు చేరుకున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని జిల్లాలో చర్చ జరుగుతోంది.