News January 8, 2025
‘దాదా’ స్మారకం: బీజేపీ వ్యూహాత్మక నిర్ణయం

దేశ రాజకీయాల్లో ‘దాదా’గా పేరొందిన ప్రణబ్ ముఖర్జీ స్మారకం నిర్మాణం నిర్ణయం వెనుక BJP సొంత వ్యూహాలు ఉన్నాయన్నది పలువురి అభిప్రాయం. ఒకవైపు మన్మోహన్ స్మారకం కోసం కాంగ్రెస్ పట్టుబడుతోంది. అయితే తన తండ్రి స్మారకం గురించి ఎందుకు అడగలేదని ప్రణబ్ కుమార్తె శర్మిష్ఠ గతంలో INCని ప్రశ్నించారు. INC కూడా ప్రణబ్ స్మారకంపై మాట్లాడలేదు. ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
Similar News
News December 9, 2025
కరీంనగర్ ఆర్టీసీ వన్ డే టూర్ ప్యాకేజీ

ఆర్టీసీ కరీంనగర్-1 డిపో ప్రత్యేక వన్ డే టూర్ ప్యాకేజీని ఏర్పాటు చేసినట్లు డి.ఎం. విజయమాధురి తెలిపారు. ఈ ప్యాకేజీలో బీదర్ జలా నరసింహస్వామి, బీదర్ పోర్టు, జరాసంగం, రేజింతల్ సందర్శన ఉంటుంది. ఈ నెల 14న ఉదయం 3:30 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి కరీంనగర్కు చేరుకుంటుంది. టికెట్ ధర పెద్దలకు రూ.1,400, పిల్లలకు రూ.1,080గా నిర్ణయించారు. ఆసక్తి గలవారు డిపోలో సంప్రదించాలని సూచించారు.
News December 9, 2025
గ్లోబల్ సమ్మిట్@ రూ.5.75 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు

TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో భారీగా పెట్టుబడులు వచ్చాయి. 2 రోజుల పాటు జరిగిన సదస్సులో మొత్తంగా ₹5.75 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొదటి రోజు ₹2,43,000 కోట్ల ఒప్పందాలు జరగ్గా మిగతా పెట్టుబడులపై 2వ రోజు MOUలు కుదిరాయి. విద్యుత్ రంగంలో ₹3,24,698 కోట్లు, AI, డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో ₹70,000 కోట్ల ఒప్పందాలు కుదిరాయి.
News December 9, 2025
పీకల్లోతు కష్టాల్లో భారత్

కటక్ వేదికగా సౌతాఫ్రికాతో తొలి T20లో భారత్ 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన IND మూడో బంతికే వైస్ కెప్టెన్ గిల్(4) వికెట్ కోల్పోయింది. కెప్టెన్ సూర్య కుమార్(12) కూడా ఎంగిడి బౌలింగ్లోనే గిల్ తరహాలో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరారు. అభిషేక్(17) దూకుడుకు బౌలర్ సిపామ్లా బ్రేకులేశారు. IND స్కోర్ 7 ఓవర్లలో 50/3.


