News December 9, 2024
త్వరలో ‘డాకు మహారాజ్’ ఫస్ట్ సింగిల్

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కిస్తోన్న ‘డాకు మహారాజ్’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌పై అప్టేడ్ వచ్చింది. ‘ఫస్ట్ సింగిల్’ లోడింగ్ అంటూ బాలయ్యతో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఉన్న పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. దీంతో అతి త్వరలోనే సాంగ్ రిలీజ్ కానుంది. వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తోంది.
Similar News
News September 23, 2025
పవన్ కళ్యాణ్‌కు వైరల్ ఫీవర్

AP: ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ బారినపడ్డారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గత రెండు రోజులుగా జ్వరంతో ఇబ్బంది పడుతున్నారని, ఫీవర్‌తోనే నిన్న అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారని తెలిపాయి. నిన్న రాత్రి నుంచి జ్వరం తీవ్రత పెరిగిందని, వైద్యులు పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నాయి. విశ్రాంతి అవసరమని సూచించారని వివరించాయి.
News September 23, 2025
ఇంద్రకీలాద్రిపై కోరినన్ని లడ్డూలు: కలెక్టర్

AP: దసరా ఉత్సవాలకు విజయవాడ దుర్గగుడిలో అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. ప్రసాద తయారీ కేంద్రాలను తనిఖీ చేశారు. ‘భక్తులు కోరినన్ని లడ్డూలను ప్రసాదంగా అందించేందుకు ఏర్పాట్లు చేశాం. 11 రోజులకు 36 లక్షల లడ్డూలు సిద్ధం చేశాం. రైల్వేస్టేషన్, బస్టాండ్ వంటి ప్రాంతాల్లో విక్రయ కేంద్రాలున్నాయి. మూలా నక్షత్రం రోజున ఉచితంగా ప్రసాదం పంపిణీ చేస్తాం’ అని తెలిపారు.
News September 23, 2025
హైకోర్టును ఆశ్రయించిన స్మితా సబర్వాల్

TG: ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ హైకోర్టును ఆశ్రయించారు. ‘కాళేశ్వరం’ ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టులో తన పేరును తొలగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఆమె సీఎంవో సెక్రటరీగా, నీటిపారుదల శాఖ ఇన్‌ఛార్జి కార్యదర్శిగా పనిచేశారు. గత ఏడాది పీసీ ఘోష్ కమిషన్ ఎదుట విచారణకు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం అనారోగ్యం కారణంగా దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు.