News January 10, 2025

నేడు హైదరాబాద్‌లో ‘డాకు మహారాజ్’ ప్రీరిలీజ్ వేడుక

image

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కించిన ‘డాకు మహారాజ్’ సినిమా ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరగనుంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో ఈవెంట్ నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నిన్న అనంతపురంలో ప్రీరిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉండగా తిరుపతి తొక్కిసలాటతో మేకర్స్ రద్దు చేశారు. ఈ క్రమంలో ఈవెంట్ దృష్ట్యా ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

Similar News

News January 10, 2025

సంభల్ బావిపై స్టేటస్ కో కొనసాగించండి: SC

image

సంభల్‌లోని షాహీ జామా మసీదు వద్ద ఉన్న బావి విష‌యమై త‌మ అనుమతి లేకుండా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవద్దని స్థానిక యంత్రాంగాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. మ‌సీదు స‌ర్వేను స‌వాల్ చేస్తూ క‌మిటీ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై CJI బెంచ్ విచారించింది. బావి ప్ర‌దేశాన్ని హ‌రి మందిర్‌గా పేర్కొన‌డాన్ని పిటిష‌న‌ర్లు త‌ప్పుబ‌ట్టారు. స్టేట‌స్ కో కొన‌సాగించాల‌ని, ఎలాంటి ఆదేశాల‌ను అమ‌లు చేయ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేసింది.

News January 10, 2025

‘పుష్ప కా బాప్’కు హ్యాపీ బర్త్ డే: అల్లు అర్జున్

image

ప్రముఖ నిర్మాత, తన తండ్రి అల్లు అరవింద్ పుట్టినరోజు వేడుకలను అల్లు అర్జున్ వినూత్నంగా నిర్వహించారు. ‘పుష్ప కా బాప్’ అంటూ అడవి, ఫైర్, ఎర్ర చందనం దుంగలతో స్పెషల్ థీమ్‌ కేక్‌ను రూపొందించారు. అరవింద్ కేక్ కట్ చేస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వేడుకలో కుటుంబసభ్యులంతా పాల్గొన్నారు. ‘హ్యాపీ బర్త్ డే నాన్న. మీ గొప్ప మనసుతో మా జీవితాలను ప్రత్యేకంగా మార్చినందుకు థాంక్స్’ అని రాసుకొచ్చారు.

News January 10, 2025

మరో క్రికెటర్ విడాకులు?

image

భారత క్రికెటర్లు వైవాహిక జీవితాన్ని నిలుపుకోవడంలో విఫలం అవుతుండటం ఫ్యాన్స్‌కు ఆందోళన కలిగిస్తోంది. క్రికెటర్లు వరుసగా విడాకులు తీసుకుంటున్నారు. ఈ జాబితాలో మరో క్రికెటర్ మనీశ్ పాండే చేరినట్లు తెలుస్తోంది. 2019లో నటి ఆశ్రితా శెట్టిని మనీశ్ వివాహమాడిన విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరూ ఒకరినొకరు ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసుకున్నారని, పెళ్లి ఫొటోలు డిలీట్ చేసుకున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.