News January 8, 2025
రేపు అనంతలో ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్

AP: సినీ నటుడు, హిందూపురం MLA నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు అనంతపురంలో నిర్వహించనున్నారు. ఈ వేడుకకు మంత్రి నారా లోకేశ్ హాజరవుతారని టీడీపీ నాయకులు తెలిపారు. అనంతపురంలో బాలయ్య వైబ్ చూడబోతున్నాం అని ఇప్పటికే మూవీ టీం ప్రకటించింది. ఈవెంట్కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ‘డాకు మహారాజ్’ ఈ నెల 12న విడుదల అవుతున్న విషయం తెలిసిందే.
Similar News
News December 6, 2025
APPLY NOW: ECHSలో ఉద్యోగాలు

విశాఖపట్నంలోని <
News December 6, 2025
పాక్, అఫ్గాన్ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలు

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సరిహద్దుల్లో నిన్న రాత్రి పెద్ద ఎత్తున కాల్పులు చోటుచేసుకున్నాయి. స్పిన్ బోల్డక్ జిల్లాలో పాక్ దళాలు దాడులు ప్రారంభించాయని అఫ్గాన్ చెప్పింది. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకున్నా చమన్ సరిహద్దులో అఫ్గాన్ కాల్పులు జరిపిందని పాక్ ఆరోపించింది. 2 దేశాల మధ్య శాంతి చర్చలు పురోగతి లేకుండా ముగిసిన నేపథ్యంలో ఈ ఘటనలు జరగడం గమనార్హం.
News December 6, 2025
కెప్టెన్సీకి నేను సిద్ధం: రియాన్ పరాగ్

IPL-2026లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని పరాగ్ తెలిపారు. ‘గత సీజన్లో 7-8 మ్యాచులకు కెప్టెన్సీ చేశా. 80-85% సరైన నిర్ణయాలే తీసుకున్నా. మినీ ఆక్షన్ తర్వాత కెప్టెన్ ఎవరనేది డిసైడవుతుంది’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మాజీ కెప్టెన్ సంజూ శాంసన్ CSKకి ట్రేడ్ అవడంతో తర్వాతి కెప్టెన్ ఎవరనే చర్చ జరుగుతోంది. జైస్వాల్, జురెల్, పరాగ్ ఈ రేసులో ఉన్నారు.


