News January 12, 2025

‘డాకు మహారాజ్’ పబ్లిక్ టాక్

image

బాలకృష్ణ, బాబీ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘డాకు మహారాజ్’. యూఎస్‌లో సినిమా ప్రీమియర్లు మొదలయ్యాయి. మూవీలో బాలకృష్ణ నటన, డైలాగ్స్ అదిరిపోయాయని.. తమన్ మ్యూజిక్ ఇరగదీశారని కామెంట్లు చేస్తున్నారు. సినిమా చివరి 30 నిమిషాలు ఊహించేలా ఉంటుందని అంటున్నారు. మొత్తానికి ఈ మూవీ బాలయ్య అభిమానులకు పసందైన విందు లాంటిదని చెబుతున్నారు. మరికాసేపట్లో WAY2NEWS రివ్యూ.

Similar News

News January 12, 2025

అకౌంట్లలోకి రూ.12,000.. మార్గదర్శకాలు విడుదల

image

TG: రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా మార్గదర్శకాలను విడుదల చేసింది. జనవరి 26 నుంచి సంవత్సరానికి ఎకరాకు రూ.12వేలు పెట్టుబడి సాయం అందించనున్నట్లు పేర్కొంది. భూభారతి (ధరణి)లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే ఈ సాయం అందనుంది. ROFR పట్టదారులకూ ఈ పథకం వర్తిస్తుంది. వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతుభరోసా నుంచి తొలగించాలని ఆదేశించింది. ఫిర్యాదుల పరిష్కారానికి కలెక్టర్ బాధ్యులుగా ఉంటారని తెలిపింది.

News January 12, 2025

మనిషి ఆయుష్షును పెంచిన తెలుగోడు ఎల్లాప్రగడ సుబ్బారావు

image

నేడు మనిషి జీవన ప్రమాణం మెరుగుపడిందంటే అందుకు కారణం మన తెలుగువాడు ఎల్లాప్రగడ సుబ్బారావు. APలోని భీమవరంలో 1895, జనవరి 12న ఆయన జన్మించారు. బోదకాలుకు ఔషధం హెట్రోజన్, యాంటీబయాటిక్ టెట్రాసైక్లిన్, క్షయను కట్టడి చేసే ఐసోనికోటినిక్ యాసిడ్ హైడ్రాజైడ్, క్యాన్సర్ చికిత్సలో ఉపకరించిన మెథోట్రెక్సేట్.. ఇలా ఎన్నో ఔషధాలతో మానవాళిని రక్షించిన ఆయన 1948, ఆగస్టు 9న కన్నుమూశారు. నేడు ఆ మహనీయుడి జయంతి.

News January 12, 2025

మహాకుంభమేళాలో స్టీవ్ జాబ్స్ భార్య

image

ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు దివంగత యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ హాజరయ్యారు. తొలుత ఆమె వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించారు. కైలాసనంద గిరి జీ మహరాజ్‌తో కలిసి ఆమె ఆలయానికి వచ్చారు. భారతీయ వస్త్రధారణలో ఆలయంలో ప్రార్థనలు చేశారు. అయితే, ఆలయ ఆచారం ప్రకారం విదేశీయులు లింగాన్ని తాకకూడదనే నిబంధన ఉండటంతో ఆమె గర్భగుడి బయటే ఉండిపోయారు.