News January 12, 2025
‘డాకు మహారాజ్’ రివ్యూ & రేటింగ్
‘చంబల్’ నీటి కష్టాలు తీర్చేందుకు ఓ చీఫ్ ఇంజినీర్ ‘డాకు మహారాజ్’లా ఎలా మారాడనేదే ఈ సినిమా స్టోరీ. బాలయ్య క్యారెక్టర్ మేకోవర్, యాక్షన్ సీన్లు, తమన్ BGM గూస్‌బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇంటర్వెల్ ముందు 20 ని.లు హైలైట్. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ స్లో అవుతుంది. ఎమోషన్లకు పెద్దపీట వేసి, మాస్ ఎలివేషన్లను తగ్గించారు. క్లైమాక్స్ ముందే ఊహించేలా ఉండటం మైనస్.
RATING: 2.75/5
Similar News
News January 12, 2025
క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్ ఆరంభించిన ఢిల్లీ సీఎం
ఢిల్లీ CM ఆతిశీ మార్లేనా క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్ ఆరంభించారు. కల్కాజీ నుంచి పోటీ చేసేందుకు రూ.40లక్షలు కావాలంటూ లింకును షేర్ చేశారు. నిజాయితీగా పనిచేసేందుకు AAPకి సామాన్యులిచ్చే చిన్న చిన్న విరాళాలే సాయపడతాయని అన్నారు. ‘ఐదేళ్లు MLA, మంత్రి, ఇప్పుడు ఢిల్లీ CMగా ఉన్న నాకు మీరు వెన్నంటే నిలిచారు. మీ బ్లెసింగ్స్, సపోర్ట్ లేకుండా ఇవేవీ సాధ్యమయ్యేవి కావు. మీ విరాళాలే నాకు తోడ్పాటునిస్తాయి’ అన్నారు.
News January 12, 2025
12 లక్షల కుటుంబాలకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’!
TG: ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భూమి లేని నిరుపేదలకు ఏటా రూ.12వేలు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దాదాపు 12 లక్షల కుటుంబాలకు ఈ నగదు ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తొలి విడత రూ.6వేల చొప్పున నేరుగా అకౌంట్లలోకి జమ చేయనుంది. కాగా ఈ పథకానికి అర్హులుగా భూమి లేని నిరుపేదలై ఉండి కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనులకు వెళ్లినవారిని పరిగణనలోకి తీసుకోనుంది.
News January 12, 2025
శ్రీవారితో రాజకీయాలు చేస్తే ఫలితాలు ఇలానే ఉంటాయి: కన్నబాబు
AP: తిరుమల ప్రసాదాన్ని కూటమి సర్కార్ రాజకీయం చేసిందని, అలా చేస్తే ఫలితాలు ఇలానే ఉంటాయని వైసీపీ నేత కన్నబాబు అన్నారు. తిరుపతి తొక్కిసలాటపై సీఎం చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘తిరుపతి తొక్కిసలాట ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం క్షమాపణ అన్నట్లు టీటీడీ ఛైర్మన్ మాట్లాడుతున్నారు. ఈ సంక్రాంతి పేదల పండుగ కాదు.. పచ్చ నేతల పండుగ’ అని ఆయన ధ్వజమెత్తారు.