News January 7, 2025
ఏకకాలంలో 3 భాషల్లో ‘డాకు మహారాజ్’ విడుదల!

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కించిన ‘డాకు మహారాజ్’ సినిమా ఈనెల 12న విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని ఏకకాలంలో తెలుగు, హిందీ, తమిళంలో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమైనట్లు సినీవర్గాలు తెలిపాయి. తమిళంతోపాటు హిందీలో బిగ్ సినిమాలు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా తెలుగులో ‘గేమ్ ఛేంజర్’, ‘డాకు మహరాజ్’ సినిమాల హవా నడవనుంది.
Similar News
News December 29, 2025
చివరి దశలో చర్చలు.. ఏం జరుగుతుందో: ట్రంప్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై చర్చలు చివరి దశలో ఉన్నాయని, ఏం జరుగుతుందో చూడాలని US అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. కీలక చర్చల కోసం ఫ్లోరిడాకు వచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఆయన ఆహ్వానించారు. 2 దేశాలు శాంతిని కోరుకుంటున్నాయని చెప్పారు. పుతిన్, జెలెన్స్కీ ఒప్పందం చేసుకునేందుకు రెడీగా ఉన్నారని తెలిపారు. భేటీకి ముందు ట్రంప్, పుతిన్ ఫోన్లో మాట్లాడారు. మీటింగ్ తర్వాతా మాట్లాడనున్నారు.
News December 29, 2025
డిసెంబర్ 29: చరిత్రలో ఈరోజు

✒1530: బాబర్ పెద్దకొడుకు హుమయూన్ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు ✒1953: రాష్ట్రాల పునర్విభజన విషయమై ఫజల్ఆలీ కమీషన్ ఏర్పాటు
✒1965: మొదటి యుద్ధట్యాంకు వైజయంత ఆవడి తయారుచేసిన భారత్
✒1974: సినీ నటి, రచయిత్రి ట్వింకిల్ ఖన్నా జననం
✒1910: ఆర్థికవేత్త రోనాల్డ్ కోస్ జననం
✒2022: బ్రెజిల్ ఫుట్బాల్ ఆటగాడు పీలే మరణం(ఫొటోలో)
News December 29, 2025
ఆ దేశాలతో పూర్తి స్థాయి యుద్ధం: ఇరాన్

అమెరికా, ఇజ్రాయెల్, యూరప్తో తాము పూర్తి స్థాయి యుద్ధంలో ఉన్నామని ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్ ప్రకటించారు. ఇరాన్ సొంత కాళ్లపై నిలబడటం పశ్చిమ దేశాలకు ఇష్టం లేదని, తమను మోకరిల్లేలా చేయాలని అనుకుంటున్నాయని చెప్పారు. ‘ఇది మనపై ఇరాక్ చేసిన యుద్ధం కంటే దారుణమైనది. చాలా క్లిష్టమైనది. అన్నివైపుల నుంచి ముట్టడిస్తున్నారు. జీవనోపాధి, భద్రతాపరంగా సమస్యలు సృష్టిస్తున్నారు’ అని అన్నారు.


