News January 21, 2025

ఈ వారమే హిందీలో ’డాకు‘ రిలీజ్

image

బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ హిందీ వెర్షన్ ఈ నెల 24న రిలీజ్ కాబోతోంది. ఎమోషన్, సహజత్వం కొనసాగేలా ఇందులో కూడా తన రోల్‌కు బాలయ్య స్వయంగా డబ్బింగ్ చెప్పారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ తెలుగులో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బీటౌన్‌లో రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

Similar News

News November 19, 2025

మావోయిస్టు నేత కొయ్యడ సాంబయ్య ఎక్కడ..!?

image

మావోయిస్టు అగ్ర నేత హిడ్మా ఎన్‌కౌంటర్, చీఫ్ తిప్పిరి తిరుపతి అంగరక్షకుల అరెస్ట్ నేపథ్యంలో ములుగు(D) చెందిన కొయ్యడ సాంబయ్య @ఆజాద్ ఎక్కడ..? అనే ప్రశ్న వినిపిస్తోంది. ఈనెల 14న ఆయనతో పాటు గోదావరిఖనికి చెందిన సికాస ఆర్గనైజర్ అశోక్ లొంగిపోయే క్రమంలో పోలీసులకు పట్టుబడ్డట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు పోలీసు వర్గాలు వారి అరెస్ట్ /లొంగుబాటును నిర్ధారించలేదు. దీంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

News November 19, 2025

నవంబర్ 19: చరిత్రలో ఈ రోజు

image

*1828: స్వాతంత్య్ర పోరాట యోధురాలు ఝాన్సీ లక్ష్మీబాయి జననం
*1917: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జననం
*1960: సినీ నటుడు శుభలేఖ సుధాకర్ జననం
*1975: మాజీ విశ్వ సుందరి, నటి సుస్మితా సేన్ జననం
*అంతర్జాతీయ పురుషుల దినోత్సవం
*ప్రపంచ టాయిలెట్ దినోత్సవం

News November 19, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 19, బుధవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.08 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.23 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.55 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.