News August 4, 2024
దళిత బంధు.. డిప్యూటీ సీఎం హెచ్చరికలు

TG: దళిత బంధు నిధులు పక్క దారి పడితే ఊరుకునేది లేదని డిప్యూటీ CM భట్టి విక్రమార్క హెచ్చరించారు. దారి మళ్లిన వాటిని వారం లోపల తిరిగి లబ్ధిదారులకు అప్పగించాలని అధికారులను ఆదేశించారు. ఖమ్మంలోని చింతకానిలో పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు. వారంలోగా రెండో దశ నిధులు విడుదల చేస్తామన్నారు. ఈ పథకం కింద మంజూరైన యూనిట్లను అమ్మడం, బదిలీ చేయడం నేరమని స్పష్టం చేశారు.
Similar News
News October 31, 2025
రూ.1,032 కోట్ల బకాయిలు, బిల్లులు విడుదల

TG: ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు, పంచాయతీరాజ్, R&B శాఖల పెండింగ్ బిల్లులకు సంబంధించి రూ.1,032 కోట్లను ఆర్థికశాఖ విడుదల చేసింది. పెండింగ్లో ఉన్న ఉద్యోగుల బకాయిలను దశలవారీగా ప్రతినెలా Dy.CM భట్టి క్లియర్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా OCT నెలకు సంబంధించి ఉద్యోగుల బకాయిలు రూ.712 కోట్లు, పంచాయతీరాజ్ R&Bకి రూ.320 కోట్లు విడుదల చేశారు. దీంతో రూ.10లక్షల లోపు ఉన్న పెండింగ్ బిల్లులు క్లియర్ కానున్నాయి.
News October 31, 2025
2,162 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

RRC నార్త్ వెస్ట్రర్న్ రైల్వేలో 2,162 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. టెన్త్, ఐటీఐ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100, SC, ST, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు. వెబ్సైట్: https://rrcjaipur.in
News October 31, 2025
మళ్లీ పెరిగిన బంగారం ధరలు!

బంగారం ధరలు గంటల వ్యవధిలోనే <<18156666>>మరోసారి<<>> పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ ఇవాళ మొత్తంగా రూ.1,800 పెరిగి ₹1,23,280కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,650కు ఎగబాకి రూ.1,13,000 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.1,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


