News September 28, 2024
దళితులే అసలైన హిందూ ధర్మ రక్షకులు: బండి

వైసీపీ చీఫ్ జగన్ తీరు హిందుత్వంపై దాడి చేసేలా ఉందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. డిక్లరేషన్ ఇస్తే తప్పేముందని ప్రశ్నించారు. ఇతర మతస్థులు హిందూ ఆలయాల్లోకి వస్తే డిక్లరేషన్ ఇచ్చిన ఘటనలు ఎన్నో ఉన్నాయన్నారు. దళితులే అసలైన హిందూ ధర్మ రక్షకులని చెప్పారు. వారిని క్రిస్టియన్లుగా మార్చే కుట్ర సాగుతోందన్నారు. మమ్మీ, డాడీ కల్చర్ వద్దని, అమ్మనాన్నే ముద్దు అని చెప్పారు.
Similar News
News February 15, 2026
టెన్త్ అర్హతతో 22,195 ఉద్యోగాలు

రైల్వేలో 22,195 గ్రూప్-D పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. టెన్త్, ఐటీఐ అర్హత గలవారు మార్చి 2 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18-33 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్ బట్టి సడలింపు ఉంటుంది. CBT, PET, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PwBD, మహిళలకు రూ.250. వెబ్‌సైట్: https://www.rrbcdg.gov.in/
News February 15, 2026
IITల్లో అకాడమిక్ ఎక్స్‌ఛేంజ్.. వేరే క్యాంపస్‌కు వెళ్లి చదువుకునే ఛాన్స్

IITలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అకాడమిక్ ఎక్స్‌ఛేంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. TOI కథనం ప్రకారం.. విద్యార్థులు ఒక సెమిస్టర్ పాటు ఇతర IIT క్యాంపస్‌లలో చదువుకోవచ్చు. అక్కడ సంపాదించిన క్రెడిట్లను వారి సొంత IIT గుర్తిస్తుంది. కేవలం ర్యాంకుకు పరిమితం కాకుండా విద్యార్థులకు నచ్చిన కోర్సులను ఇతర IITల్లో నేర్చుకునే స్వేచ్ఛను కల్పించడమే ఈ నిర్ణయం వెనక ఉద్దేశం.
News February 15, 2026
‘ఫుడ్ జిహాద్’ పేరుతో వేధిస్తారా.. ఒవైసీ ఆగ్రహం

TG: మేడారం జాతరలో కర్నూలుకు చెందిన చిరువ్యాపారి వలీని వేధించిన యూట్యూబర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. వ్యూస్ కోసం పేద వ్యాపారిని అవమానించడం, మత రంగు పులిమి వేధించడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. కేవలం రూ.10కి కోవా బన్ను అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న వ్యక్తిని ‘ఫుడ్ జిహాద్’ పేరుతో భయభ్రాంతులకు గురిచేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు.


