News August 5, 2024
కొన్న రెండ్రోజుల్లోనే పాడైన బైక్.. OLAకి భారీ జరిమానా!

‘OLA’ కంపెనీకి జిల్లా వినియోగదారుల కోర్టు భారీ జరిమానా విధించింది. సదరు కంపెనీకి చెందిన స్కూటర్‌ను జహీరాబాద్‌కు చెందిన మద్ది డేవిడ్ జులై 3, 2023న కొనుగోలు చేశారు. రెండు రోజులకే పాడవడంతో కంపెనీని సంప్రదించగా సమస్యను పరిష్కరించడంలో విఫలమైంది. దీంతో అతను సంగారెడ్డి జిల్లా వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపిన కోర్టు కస్టమర్‌కు రూ.1,92,205 చెల్లించాలని కంపెనీని తాజాగా ఆదేశించింది.
Similar News
News January 2, 2026
ఎలాన్ మస్క్.. విరాళాల్లోనూ శ్రీమంతుడే!

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తాను విరాళాల్లోనూ శ్రీమంతుడేనని నిరూపించారు. ఏకంగా 100 మిలియన్ డాలర్ల(సుమారు రూ.900 కోట్లు) విలువైన 2.10 లక్షల టెస్లా షేర్లను తన ఫౌండేషన్‌కు డొనేట్ చేశారు. 2024లో 112 మిలియన్ డాలర్లు, 2022లో 1.95 బిలియన్ డాలర్లు, 2021లో 5.74 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను ఛారిటీకి ఇచ్చారు. తాజా డొనేషన్ తర్వాత కూడా 619 బిలియన్ డాలర్లతో ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఆయన కొనసాగుతున్నారు.
News January 2, 2026
జనవరి 2: చరిత్రలో ఈరోజు

✒1954 : భారతరత్న పురస్కారం ప్రారంభం
✒1918: తెలంగాణకు చెందిన స్వాతంత్ర్య పోరాట యోధుడు బత్తిని మొగిలయ్య గౌడ్ జననం
✒1957: తెలుగు సినిమా హాస్యనటుడు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం (AVS) జననం (ఫొటోలో కుడివైపున)
✒1945: హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు మరణం (ఫొటోలో ఎడమవైపున)
✒2015: భారతీయ శాస్త్రవేత్త, పద్మశ్రీ, పద్మభూషణ అవార్డుల గ్రహీత వసంత్ గోవారికర్ మరణం
News January 2, 2026
5 బిల్లులు.. MGNREGAపై స్వల్పకాలిక చర్చ

TG: అసెంబ్లీలో ఇవాళ చేపట్టే బిజినెస్ కార్యక్రమాలను కార్యదర్శి తిరుపతి ప్రకటించారు. ముందుగా ప్రశ్నోత్తరాలు ఉంటాయి. ఆపై BAC రిపోర్ట్‌ను CM రేవంత్ ప్రవేశపెడతారు. మంత్రి ప్రభాకర్ రవాణా, BC వెల్ఫేర్ గెజిట్ నోటిఫికేషన్ పత్రాలు సభకు సమర్పిస్తారు. మున్సిపల్, GHMC ACT సవరణ, ప్రైవేటు వర్సిటీలు, మోటార్ వెహికల్ టాక్సేషన్ చట్ట సవరణ బిల్లులు ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. MGNREGAపై స్వల్పకాలిక చర్చ ఉంటుంది.


