News December 10, 2024

దమ్ముంటే లోకేశ్‌తో చర్చకు రా: మంత్రి వాసంశెట్టి

image

AP: వైసీపీ మళ్లీ గెలుస్తుందనే భ్రమలో ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఉన్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఆయనకు దమ్ముంటే మంత్రి లోకేశ్‌తో చర్చకు రావాలని సవాల్ విసిరారు. అప్పుడే ఎవరి గొప్ప ఏంటో తెలుస్తుందన్నారు. వైసీపీకి ఒక్క అవకాశం ఇస్తే ఏమైందో ప్రజలు చూశారని ఎద్దేవా చేశారు.

Similar News

News December 3, 2025

‘కాటన్ ష్రెడర్‌’తో మరిన్ని ప్రయోజనాలు

image

కాటన్ ష్రెడర్‌తో తక్కువ ఇంధనంతోనే మొక్క కాండాలను చిన్న ముక్కలుగా చేయవచ్చు. పత్తి వ్యర్థాలను భూమిలో కలియదున్నడం వల్ల నేలసారం పెరగడంతో పాటు నీటిని నిల్వచేసుకునే సామర్థ్యం భూమికి పెరుగుతుంది. మట్టి సేద్యానికి అనువుగా, వదులుగా మారుతుంది. నేల కోతను తగ్గించవచ్చు. పత్తి వ్యర్థాలను భూమిలో కలియదున్నడం వల్ల గులాబీ పురుగు ఉద్ధృతిని చాలా వరకు తగ్గుతుంది. పంటకు మేలుచేసే సూక్ష్మజీవుల సంఖ్య వృద్ధి చెందుతుంది.

News December 3, 2025

భారత్‌ ముక్కలైతేనే బంగ్లాదేశ్‌కు శాంతి: అజ్మీ

image

బంగ్లా మాజీ ప్రధాని హసీనాను అప్పగించడంపై భారత్-బంగ్లా మధ్య చర్చలు కొలిక్కి రాలేదు. ఇలాంటి తరుణంలో బంగ్లా ఆర్మీ మాజీ జనరల్, జమాతే ఇస్లామీ మాజీ చీఫ్ గులాం అజామ్ కుమారుడు అబ్దుల్లాహిల్ అమాన్ అజ్మీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ‘భారత్ ముక్కలవ్వకుండా ఉన్నంతకాలం బంగ్లాలో శాంతి నెలకొనదు’ అంటూ అక్కసు వెళ్లగక్కారు. 1971 లిబరేషన్ వార్‌లో హిందువులు, ప్రో లిబరేషన్ బెంగాలీల ఊచకోతకు ఇతని తండ్రే కారణం.

News December 3, 2025

రాగి పాత్రలు వాడుతున్నారా?

image

ఆరోగ్యం కోసం ప్రస్తుతం చాలామంది రాగిపాత్రల వాడకం మొదలుపెట్టారు. అయితే వీటిలో కొన్ని ఆహారపదార్థాలు పెట్టేటపుడు జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. రాగిపాత్రలో పెట్టిన పెరుగును తింటే వికారం, వాంతులు, విరేచనాలు అవుతాయి. అలా-గే సిట్రస్ ఫ్రూట్స్‌తో పెట్టిన పచ్చళ్లు, ఆహారాలు రాగితో రసాయన చర్యలు జరుపుతాయి. కేవలం నీటిని, అదీ 8-12 గంటలపాటు నిల్వ ఉంచిన నీటినే తాగాలని సూచిస్తున్నారు.